అమరావతి మచ్చ చెరిగిపోదా? బాబూ ఇలా చేస్తే ఎలా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనుకున్నట్లు.. అందరూ ఊహించినట్లే చేశారు. తనపై దాఖలైన కేసుల విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి చంద్రబాబు ఈ కేసులో తన ప్రమేయం [more]

;

Update: 2021-03-19 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనుకున్నట్లు.. అందరూ ఊహించినట్లే చేశారు. తనపై దాఖలైన కేసుల విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి చంద్రబాబు ఈ కేసులో తన ప్రమేయం లేదని విచారణకు హాజరై నిరూపించుకుని ఉంటే బాగుండేది. కానీ హైకోర్టును ఆశ్రయించి స్టేను కోరడం ద్వారా మరోసారి ఆయనపై స్టే ముద్రపడిపోయింది. తనపై నమోదయిన ఎఫ్ఐఆర్ లు రద్దు చేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. సీఐడీ విచారణకు హాజరయి, తానేమీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం దళితులకు చెందిన అసైన్డ్ భూములు తీసుకోలేదని, ప్రభుత్వం, పరిపాలన, నూతన రాజధాని కోసమే తీసుకున్నానని చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.

అన్నింటా అక్రమాలే…..

2019 ఎన్నికల ఫలితాల తర్వాత రాజధాని అమరావతి భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై జగన్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాజధాని ప్రకటనకు ముందే కొందరు ఈ భూములను కొనుగోలు చేశారని, వారికి రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలియడం వల్ల పెద్దయెత్తున భూములను కొనుగోలు చేశారని మంత్రి వర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. కేవలం క్యాపిటల్ సిటీ, అమరావతి రీజియన్ లోనే ఈ భూముల కొనుగోళ్లు జరిగాయి. బినామీ పేర్లతో టీడీపీ నేతలు భూములను కొనుగోలు చేశారని మంత్రి వర్గం ఉపసంఘం తేల్చింది. బినామీలకు మేలు చేసేలా రాజధాని సరిహద్దులను నిర్ణయించారని పేర్కొంది. లంక, పోరంబోకు ప్రభుత్వ భూముల రికార్డుల్లో అక్రమాలు ఉన్నట్లు మంత్రి వర్గ ఉప సంఘం గుర్తించింది. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని గత ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంది. అలాగే 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారని పేర్కొంది. ఇది చంద్రబాబు తన అనుకూలురైన వారికి మేలు చేకూర్చేందుకే నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొంది.

బినామీల బాగోతం….

2014 జూన్ 1వ తేదీ నుంచి డిసెంబరు 31వరకూ అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లు జరిగాయి. 4,070 ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు గుర్తించింది. ఇందులో లబ్దిపొందిన వారి పేర్లను కూడా తెలిపింది. చంద్రబాబు, వేమూరు రవికుమార్, పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, లంకా దినకర్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను మంత్రి వర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. నారా లోకేష్ బినామీ గా ఉన్న వేమూరి రవికుమార్ భారీగా భూములను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. టీడీపీ నేతల కోసం సీఆర్డీఏ పరిధిని కూడా పెంచినట్లు పేర్కొంది.

నిరూపించుకోవాల్సిన బాధ్యత…..

అయితే ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది కేవలం దళితుల అసైన్డ్ భూముల విషయంలోనే. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అనుసరించలేదని ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. అయితే ఇన్నాళ్లు అమరావతి భూముల విషయంలో తాను అక్రమాలకు పాల్పడలేదని, ఇరవై నెలలయినా జగన్ ఏం పీకారని చంద్రబాబు పదే పదే ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే మాట అన్నారు. ఇప్పుడు సీఐడీ కేసు నమోదయిన వెంటనే హైకోర్టుకు వెళ్లడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడినా తనపై నమోదయిన కేసులో ఏమీ లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. లేకుంటే చంద్రబాబు జీవితాంతం అమరావతి మచ్చ ను అంటించుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News