చంద్రబాబు ఆత్మానందం…. అందుకోసమేగా?
చంద్రబాబు ఎలాంటి వారు ఎలా అయిపోయారు అన్న మాట అయితే సొంత పార్టీ నుంచే వినిపిస్తోంది. ఒకనాడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఇపుడు తాడూ [more]
చంద్రబాబు ఎలాంటి వారు ఎలా అయిపోయారు అన్న మాట అయితే సొంత పార్టీ నుంచే వినిపిస్తోంది. ఒకనాడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఇపుడు తాడూ [more]
చంద్రబాబు ఎలాంటి వారు ఎలా అయిపోయారు అన్న మాట అయితే సొంత పార్టీ నుంచే వినిపిస్తోంది. ఒకనాడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఇపుడు తాడూ బొంగరం లేని టీడీపీని గాడిన పడేయలేక తెగ ఆయాసపడుతున్నారు. ఏపీలో టీడీపీ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అదే సమయంలో తెలంగాణాలో చూస్తే ఇంకా దుర్బరమైన పరిస్థితి ఆ పార్టీకి ఉంది. 2004 తరువాత తెలంగాణాలో టీడీపీకి అధికారం అన్నదే లేకుండా పోయింది. అంటే దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఒక పార్టీని ఎలాంటి అధికారం లేకుండా కొనసాగించడం కష్టమైన విషయం.
అందుకోసమే…?
ఇక 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో పార్టీ ఫండింగ్ కొంత చేయడం వల్ల తెలంగాణా పార్టీ నిలబడింది. ఇపుడు రెండు చోట్ల పవర్ లో లేదు. దాంతో తెలంగాణా టీడీపీకి నిధుల కొరత కూడా దాపురిస్తోంది. వీటన్నిటికీమించి టీడీపీకి నాయకుడుగా ఎవరిని ఉంచినా కూడా గత వైభవాలు ఉండవు, కొత్త వెలుగులు కూడా వచ్చే అవకాశం ఏ విధంగానూ లేదు అన్నది నిజం. తెలంగాణాలో వందల కోట్ల విలువ చేసే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది. దాన్ని కాపాడుకోవడం కోసం, జాతీయ పార్టీగా టీడీపీని చెప్పుకోవడం కోసమే చంద్రబాబు అక్కడ శాఖను ఈ రోజుకీ కొనసాగిస్తున్నారు అంటున్నారు.
కొత్త అధ్యక్షుడిగా…?
ఇక షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కన నరసింహులును కొత్త అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. ఒక వైపు ప్రజాకర్షణలో తిరిగులేని కేసీఆర్ టీఆర్ఎస్ సారధిగా అధికారంలో ఉన్నారు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఆయన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు బీజేపీకి జోరు చేసే బండి సంజయ్ నాయకత్వం ఉంది. పైగా దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ మెయిన్ టార్గెట్ తెలంగాణ మీదే ఉంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది.
సాధించేదేమీ లేకపోయినా?
ఇక కాంగ్రెస్ కి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి సారధ్యం ఉంది. రేవంత్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వడంతోనే ఆ పార్టీలో ఎక్కడా లేని జోష్ వచ్చేసింది. కొత్తగా పార్టీని పెట్టిన షర్మిల గ్లామరే టీ వైసీపీకి అతి పెద్ద ఆకర్షణ. మరి ఈ నేపధ్యంలో టీటీడీపీకి ఒక అధ్యక్షుడు ఉన్నారని చెప్పి ఆత్మానందం పొందడం తప్ప చంద్రబాబు సాధించేది ఏముంది అంటున్నారు. టీడీపీకి క్యాడర్ లేదు, నాయకులు కూడా పెద్దగాలేరు. అయినా సరే అక్కడ పార్టీని కొనసాగించడం అన్నది చంద్రబాబు రాజకీయ అవసరాలకు తప్ప జనాల కోసం కాదు, గెలుపు కోసం అంతకంటే కాదు అన్న మాట గట్టిగానే వినిపిస్తోంది.