క‌మ్మోళ్లు vs న‌మ్మిన‌బంటు మ‌ధ్య‌లో న‌లుగుతోన్న చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలకు నెమ్మదిగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గత సాధారణ ఎన్నికల తర్వాత పలువురు కీలక నేతలు పార్టీ మారిపోవడం… కొంద‌రు కాడి [more]

Update: 2021-08-10 12:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలకు నెమ్మదిగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గత సాధారణ ఎన్నికల తర్వాత పలువురు కీలక నేతలు పార్టీ మారిపోవడం… కొంద‌రు కాడి కింద పడేయ‌డంతో 30 నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జ్‌లు లేకుండా పోయారు. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరు లేకపోవడంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కు దివాణం లేకుండా పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికారం అందని ద్రాక్ష అవుతుందని భావించిన చంద్రబాబు ఆ నియోజకవర్గాల్లో బలమైన ఇంచార్జ్ లను సెట్ చేసుకుంటూ వస్తున్నారు. గత రెండు నెలల్లోనే పది నియోజకవర్గాలకు కొత్త నేతలు వచ్చారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన కొవ్వూరు నియోజకవర్గం బాధ్యతల విషయంలో మాత్రం చంద్రబాబు సంకటస్థితికి ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కేఎస్ జవహర్ ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. జవహర్ మంత్రి అయ్యాక కొవ్వూరు నియోజకవర్గంలో టిడిపి రాజకీయాలను శాసించే పెండ్యాల అచ్చిబాబు… కొందరు కమ్మ సామాజిక వర్గం నేతలు జవహర్ కు వ్యతిరేకం అయిపోయారు.

నమ్మకమైన నేతగా…

మంత్రిగా జవహర్ పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించారు. ఎస్సీ నేత‌ల్లో ఇంత త‌క్కువ టైంలో అంత కీల‌కంగా ఎదిగిన నేత ఆయ‌న ఒక్క‌రే. పెద్ద‌గా వివాదాల్లోనూ ఉండ‌రు. గత ఎన్నికల్లోనూ ఆయన అక్కడే పోటీ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా కమ్మ సామాజిక వర్గ నేతల లాబీయింగ్ కు చంద్రబాబు త‌లొగ్గ‌క‌ తప్పలేదు. చివరకు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చాక జ‌వ‌హ‌ర్‌ను కృష్ణా జిల్లాలోని తిరువూరు ( జ‌వ‌హ‌ర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం) నుంచి పోటీ చేయించి… అప్పుడు విశాఖ జిల్లాలోని పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత కొవ్వూరు బరిలో దింపారు. గత ఎన్నికల్లో కొవ్వూరు, తిరువూరు రెండు చోట్ల టిడిపి ఓడిపోయింది. తిరువూరులో గట్టిపోటీ ఇచ్చిన జవహర్ గత ఎన్నికలు ముగిసినప్ప‌టి నుంచి కొవ్వూరుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. తాజాగా తిరువూరుకు దేవదత్తను కొత్త ఇన్చార్జిగా చంద్రబాబు ప్రకటించారు.

ఆయనను కాదని…..

అంతకుముందే పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులను చంద్రబాబు ప్రకటించినప్పుడు జవహర్ ను వ్యూహాత్మకంగా రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. అప్పుడే జ‌వహ‌ర్‌కు కొవ్వూరు ఇంచార్జి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే పార్టీలో ఉన్న స్థానిక నేతలు చంద్రబాబుపై లాబీయింగ్‌ ప్రారంభించడంతో చంద్రబాబు మౌనంగా ఉంటూ వస్తున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే కొవ్వూరు అసెంబ్లీ కూడా ఉంది. అటు జ‌వ‌హ‌ర్ ఇక్కడ పార్లమెంటరీ అధ్యక్షుడుగా ఉండడంతో పాటు.. ఇటు తిరువూరుకు కొత్త ఇన్చార్జిని ప్రకటించడంతో కొవ్వూరు బాధ్యతలు జ‌వ‌హ‌ర్‌కు అప్పగించటం మిగిలి ఉంది. అయితే కొవ్వూరు నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న పెండ్యాల అచ్చిబాబు చంద్రబాబుకు ఎంతో సన్నిహితుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి పెండ్యాల ఫ్యామిలీ కొవ్వూరు రాజ‌కీయాల‌ను శాసిస్తోంది. చంద్రబాబు ఆయ‌న్ను కాద‌నే ప‌రిస్థితి లేదు.

ఎట్టి పరిస్థితుల్లో….

అయితే జ‌వ‌హార్ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడిన గ్యాప్‌ నేపథ్యంలో అచ్చిబాబు వర్గం మళ్లీ ఇప్పుడు వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించింది. జ‌వ‌హ‌ర్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ కొవ్వూరు పగ్గాలు ఇస్తే సహించేది లేదని ఆ వర్గం తెగేసి చెబుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో చంద్రబాబు సైతం స్థానిక టిడిపి నేతల మాటను కాదనలేని పరిస్థితి. చంద్రబాబు – లోకేష్ ఇద్దరు జ‌వ‌హ‌ర్‌కు కొవ్వూరు బాధ్యతలు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. స్థానిక నేతల ఒత్తిడి మేరకే ఈ ప్రకటన వాయిదా వేస్తూ వస్తున్నారు. స్థానిక నేతలు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ జ‌వ‌హ‌ర్‌ను ఇక్క‌డ‌ ఒప్పుకోమని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో వచ్చే ఎన్నికల నాటికి ఎవరు రాజీ పడతారు ? చంద్రబాబు పార్టీని న‌మ్ముకున్న త‌న ఆప్తుడుకు ? న్యాయం చేస్తారా ? లేదా త‌న వ‌ర్గం నేతల ఒత్తిడికి లొంగి పోతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News