ఆ నియోజకవర్గాన్ని చంద్రబాబు ఆయనకు రిజర్వ్ చేసేశారా ?
టీడీపీలో ఒక చర్చ సాగుతోంది. ఒక నియోజకవర్గాన్ని చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం .. ఓ కీలక నాయకుడికి రిజర్వ్ చేశారని అంటున్నారు. ఆ నియోజకవర్గాన్నిఆయనకు తప్ప [more]
;
టీడీపీలో ఒక చర్చ సాగుతోంది. ఒక నియోజకవర్గాన్ని చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం .. ఓ కీలక నాయకుడికి రిజర్వ్ చేశారని అంటున్నారు. ఆ నియోజకవర్గాన్నిఆయనకు తప్ప [more]
టీడీపీలో ఒక చర్చ సాగుతోంది. ఒక నియోజకవర్గాన్ని చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం .. ఓ కీలక నాయకుడికి రిజర్వ్ చేశారని అంటున్నారు. ఆ నియోజకవర్గాన్నిఆయనకు తప్ప ఎవరికీ కేటాయించే అవకాశం లేదని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎవరు ఎన్ని విధాలా ప్రయత్నం చేసినా.. సదరు నియోజకవర్గం జోలికి మాత్రం పోవద్దని.. టీడీపీ నేతలకు.. చంద్రబాబు మౌఖిక ఉత్తర్వులు కూడా ఇచ్చారని.. అంటున్నారు. అంటే.. ప్రస్తుతం వైసీపీ నేత.. ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సాగడం లేదని.. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని.. వంటి విమర్శలు చేయొద్దని.. చంద్రబాబు సూటిగా చెప్పారని అంటున్నారు.
వైసీపీకి దూరమై…
దీంతో ఆ నియోజకవర్గాన్ని దాదాపు ఇప్పుడు టీడీపీ నేతలు ఎవరూ టచ్ చేయడం లేదు. దీంతో అది ఆ వైసీపీ నేతకు రిజర్వ్ అయినట్టేననే చర్చ జోరుగా సాగుతోంది. కొన్నాళ్లుగా వైసీపీలోనే ఉంటూ.. ఆ పార్టీపై విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణ రాజు.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే.. ఈయనను వైసీపీ వాళ్లు పక్కన పెట్టారు వ్యూహాత్మకంగా.. ఆయనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నా ఇది వర్కవుట్ కావడం లేదు. అయితే.. మరో రెండున్నరేళ్ల సమయం ఉంది కనుక అనర్హత వేటు పడితే.. ఆరేళ్ల వరకు ఏ పార్టీ తరఫునా ఆయన పోటీ చేసే అవకాశం ఉండదు.
మళ్లీ ఆయననే…
ఇది జరిగితే.. వైసీపీకి మేలు. అయితే.. అలా జరగని పక్షంలో మళ్లీ ఆయన పోటీకి దిగుతారు. అయితే.. ఈ దఫా వైసీపీ టికెట్ ఇవ్వదు కాబట్టి.. ఆయన టీడీపీ తరఫున పోటీ చేసేలా.. చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని ఆ పార్టీ నేతల్లోనే చర్చ సాగుతోంది. జిల్లాకుచెందిన పార్టీ నాయకుల మధ్య ఇదే విషయం తరచూ చర్చకు వస్తోంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని ఓపెన్‌గానే చెపుతున్నారు. ఆ నియోజకవర్గం రఘురామకు రిజర్వ్ అయిందని.. దీనిని ఎవరికీ కేటాయించే పరిస్థితి లేదని వారు చెపుతున్నారు.
సంకేతాలు వచ్చాయని….
దీనిపై తమకు చంద్రబాబు నుంచి చూచాయగా కొన్ని సందేశాలు కూడా వచ్చాయని కూడా జిల్లా పార్టీలో కీలక నేతలు చెపుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా మాట్లాడేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా టీడీపీ నేతలు.. ఎవరూ కూడా నరసాపురం గురించి చెప్పడం లేదు. ఈ పరిణామాలతో .. ఆ నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో రఘురామకు దాదాపు ఫిక్స్ అయ్యిందనే అంటున్నారు. విచిత్రం ఏంటంటే గత ఎన్నికలకు ముందు వరకు ఆయన నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గానే ఉన్నారు.