బాబు లైఫ్‌లో ఎన్నో ఎన్నిక‌లు.. కానీ.. తిరుప‌తి డిఫ‌రెంటేనా?

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు త‌న రాజ‌కీయ జీవితంలో అనేక ఎన్నిక‌లు చూశారు. వ్యక్తిగ‌తంగా ఆయ‌న అనేక ఎన్నిక‌లు ఎదుర్కొన్నారు. ఇక‌, [more]

;

Update: 2020-12-22 00:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు త‌న రాజ‌కీయ జీవితంలో అనేక ఎన్నిక‌లు చూశారు. వ్యక్తిగ‌తంగా ఆయ‌న అనేక ఎన్నిక‌లు ఎదుర్కొన్నారు. ఇక‌, పార్టీ ప‌రంగానూ అనేక ఎన్నిక‌ల‌ను ఆయ‌న చ‌విచూశారు. దాదాపు న‌ల‌భై ఏళ్లకు పైగా.. చంద్రబాబు ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ చ‌విచూడ‌ని ఎన్నిక‌లు, ఆయ‌న పాల్గొన‌ని ఎల‌క్షన్స్ లేవంటే అతిశ‌యోక్తి కాదు. మ‌రి అంత‌టి సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ చాణ‌క్యుడు కూడా ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక‌పై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా ? ఇక్కడ గెలుపు గుర్రం ఎలా ఎక్కాలి అనే విష‌యంలో త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారా ? మ‌రీ ముఖ్యంగా అధికార వైసీపీకి ఎలా చెక్ పెట్టాల‌నే విష‌యంలో ఆయ‌న కంటిపై కునుకు ప‌ట్టడం లేదా ? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు.

ఎప్పుడు పోటీ చేసినా…..

నిజానికి చిత్తూరు జిల్లా చంద్రబాబుకు సొంత జిల్లా. అందునా.. తిరుమ‌ల వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కూడా తిరుప‌తి. అటు ఎన్టీఆర్ హ‌యాంలోను, ఇటు చంద్రబాబు హ‌యాంలోనూ తిరుమ‌ల‌ను భారీగానే అభివృద్ధి చేశారు. ఇక‌, తిరుప‌తి ప‌ట్టణాన్ని కూడా అనేక రూపాల్లో అభివృద్ధి చేశారు. కేంద్రం ప్రక‌టించిన ఉత్తమ న‌గ‌రాల జాబితాలోనూ తిరుప‌తికి చంద్రబాబు హ‌యాంలోనే అవార్డు ల‌భించింది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ప‌ట్టులేక పోవ‌డం గ‌మ‌నార్హం. తిరుప‌తి పార్లమెంటు ప‌రిధిలో పోటీ చేసిన ప్రతిసారీ..(ఒంట‌రిగా) టీడీపీ ఓట‌మి పాలైంది. ఎప్పుడైనా పొత్తులో క‌నుక ఎన్నిక‌ల‌కు వెళ్తే.. క‌ళ్లుమూసుకుని పొత్తుపార్టీకి ఈ టికెట్ ఇచ్చేయ‌డం కూడా రివాజుగా మారింది. దీంతో టీడీపీ తిరుప‌తి పార్లమెంటు స్థాయిలో బ‌లం పుంజుకోలేద‌న్నది వాస్తవం.

తొలి ఎన్నిక కావడంతో…..

కానీ.. రాష్ట్రంలో సార్వత్రిక స‌మ‌రం ముగిసిన ఏడాదిన్నర త‌ర్వాత వ‌స్తున్న తొలి ఎన్నిక‌, పైగా త‌న సొంత జిల్లాలో వ‌స్తున్న ఉప ఎన్నిక కావ‌డంతో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఏడాదిన్నర‌గా వైసీపీ ప్రభుత్వంపై తాను ఏయే ఆరోప‌ణ‌లు చేస్తున్నారో.. అరాచ‌క పాల‌న‌, తుగ్లక్ పాల‌న‌, ఫేక్ సీఎం.. అంటూ.. జ‌గ‌న్ కేంద్రంగా ఎలా విరుచుకుప‌డుతున్నారో.. వాటిని నిజం చేయాల్సిన త‌రుణం.. ఇప్పుడు ఎన్నిక‌ల రూపంలో చంద్రబాబుకు వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధానికి రెఫ‌రెండంగానే ఆయ‌న ఎన్నిక‌ల‌ను తీసుకుంటున్నట్టు టీడీపీ వ‌ర్గాలు కూడా చెబుతున్నారు. ఈక్రమంలో గ‌తంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తిరుప‌తి ఉప పోరును ప్రతిష్టాత్మకంగా అదేస‌మ‌యంలో స‌వాలుగా కూడా తీసుకున్నారు.

పకడ్బందీ వ్యూహంతో…..

ఈ క్రమంలోనే వ్యూహం పై వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌ట చంద్రబాబు. ఇప్పటికే ఆలూ లేదు.. చూలూ లేదు.. అన్నట్టుగా ఎన్నిక‌ల నోటిఫికేష‌నే లేక‌పోయినా అభ్యర్థిని ప్రక‌టించారు. ఈ ప్రతిష్టాత్మక ఉప పోరులో టీడీపీకి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిన కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మే అభ్యర్థిగా గ‌త‌య్యారు. ఇక‌, ప్రచార బాధ్యత‌ల‌ను మ‌హిళ‌ల్లో ప‌రిటాల సునీత‌, వంగ‌ల‌పూడి అనిత‌ల‌కు అప్పగించార‌నే ప్రచారం ఉంది. అదేస‌మ‌యంలో కింజ‌రాపు కుటుంబాన్ని తిరుప‌తిలో డంప్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక‌, సినీ రంగం నుంచి బాల‌య్య రంగంలోకి దిగుతారు. డిజిట‌ల్ ప్రచారానికి ఇప్పటికే చంద్రబాబు త‌న‌యుడు లోకేష్ రెడీ అయ్యారు. ఇక‌, ఉప ఎన్నిక ప్రచారం చివ‌రి రెండు రోజ‌లు తానే స్వయంగా ప్రజ‌ల్లోకి వెళ్లేలా చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ఇవ‌న్నీ.. చూస్తున్న త‌మ్ముళ్లు.. చంద్రబాబు లైఫ్‌లో ఎన్నో ఎన్నిక‌లు చూశారు.. కానీ.. తిరుప‌తి డిఫ‌రెంటేనా? అని చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News