సోమిరెడ్డితో పాటు ఆ ఇద్దరికి బాబు టార్గెట్ ఇదేనట
తిరుపతి ఉప ఎన్నికలపై చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఎలాగైనా గెలిచి పార్టీలో జోష్ నింపాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే తిరుపతి ఉప ఎన్నిక కోసం వ్యూహకర్తను కూడా [more]
;
తిరుపతి ఉప ఎన్నికలపై చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఎలాగైనా గెలిచి పార్టీలో జోష్ నింపాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే తిరుపతి ఉప ఎన్నిక కోసం వ్యూహకర్తను కూడా [more]
తిరుపతి ఉప ఎన్నికలపై చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఎలాగైనా గెలిచి పార్టీలో జోష్ నింపాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే తిరుపతి ఉప ఎన్నిక కోసం వ్యూహకర్తను కూడా నియమించుకున్నారు. ఐదంచెల వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. కానీ పార్టీ ఎంత చేసినా నాయకత్వం బలంగా ఉంటేనే గెలుపు సాధ్యమవుతుంది. అందుకే నెల్లూరు జిల్లాలోని ముగ్గురి నేతలకు చంద్రబాబు సీరియస్ గా చెప్పినట్లు తెలిసింది.
అలసత్వం వద్దంటూ….
తిరుపతి ఉప ఎన్నికలో ఎలాగూ ఓడిపోతామని కొందరు నేతలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, అది కరెక్ట్ కాదని, కొంచెం కష్టపడితే గెలుపు సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పారు. నెల్లూరు జిల్లా నేతల్లో ఈ అలసత్వం కన్పిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలున్నాయి.
బలంగా ఉన్న టీడీపీని…..
గతంలో ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉండేది. నాయకత్వం లోపం కారణంగానే పార్టీ అక్కడ బలహీనపడిందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీరియస్ గా ఉండటం లేదన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. ఆయన 2014లో ఓటమి పాలయినా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చినా నియోజకవర్గంలో బలం పెంచుకునే ప్రయత్నం చేయకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఈ ఫలితంపైనే…?
తిరుపతి ఉప ఎన్నికలో సర్వేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థికి మెజారిటీ రావాలని చంద్రబాబు సోమిరెడ్డికి కొంచెం కటువుగానే చెప్పినట్లు తెలిసింది. అలాగే గూడూరు నియోజకవర్గంలో పాశం సునీల్ కుమార్, వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు కూడా చంద్రబాబు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఫలితాల ఆధారంగానే భవిష్యత్ ఉంటుందని పరోక్షంగా చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ మూడు నియోజకవర్గాలపైనే చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. మరి బాబు వార్నింగ్ లు పనిచేస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.