పెద్ద తోపు అనుకుంటున్నావా? అంత సీన్ లేదులే

ిచిరాగ్ పాశ్వాన్. గట్టిగా ఏడేళ్ల రాజకీయ అనుభవం లేని యువకుడు. అయితే ఇప్పుడు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ కే సవాల్ విసురుతున్నారు. కేంద్రమంత్రి రాంవిలాస్ [more]

;

Update: 2020-10-12 17:30 GMT

ిచిరాగ్ పాశ్వాన్. గట్టిగా ఏడేళ్ల రాజకీయ అనుభవం లేని యువకుడు. అయితే ఇప్పుడు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ కే సవాల్ విసురుతున్నారు. కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడే చిరాక్ పాశ్వాన్. ఈయన లోక్ జనశక్తి పార్టీ అధినేత గా వ్యవహరిస్తున్నారు. బీహార్ ఎన్నికల సమయంలో చిరాగ్ పాశ్వాన్ కీలకంగా మారారు. నిజానికి ఈ పార్టీ ఏన్డీఏ కూటమిలో ఉంది. కానీ నితీష్ కుమార్ మీద కాలుదువ్వుతోంది.

విడిగానే పోటీ….

తాము ఎట్టిపరిస్థితుల్లో బీహార్ ఎన్నికల్లో విడిగానే పోటీ చేస్తామని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. నితీష్ కుమార్ మీద బలమైన అభ్యర్థిని పోటీకి దింపుతామని చిరాగ్ పాశ్వాన్ చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ అంత సీన్ ఉందా? అన్నదే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పిల్లకాకి బెదిరింపులకు నితీష్ కుమార్ బెదురుతారా? అని జనతాదళ్ యు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

కుటుంబ పార్టీ…..

నిజానికి చిరాగ్ పాశ్వాన్ 2013 లో నే రాజకీయాల్లోకి వచ్చారు. పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీని కుటుంబ పార్టీగా మార్చారు. దానికి అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్. కుటుంబ సభ్యుల్లో ఎంపీలుగా కుమారుడు, సోదరులు కూడా ఉన్నారు. టిక్కెట్లన్నీ ఆయన కుటుంబ సభ్యులకే కేటాయిస్తూ ఫ్యామిలీ ప్యాక్ ను బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. నితీష్ కుమార్ ను వ్యతిరేకించే ఒక్క అంశమూ చిరాగ్ పాశ్వాన్ చెప్పలేకపోతున్నారు. నితీష్ పాలసీలను తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పుకొస్తున్నారు.

ఈ ట్విస్ట్ ఏంటో?

ఇంకో ట్విస్ట్ ఏంటంటే బీజేపీతో తమకు ఏమాత్రం శతృత్వం లేదంటున్నారు చిరాగ్ పాశ్వాన్. ఈ ఎన్నికల్లో అనేక చోట్ల బీజేపీతో కొన్ని చోట్ల ఫ్లెండ్లీ పోటీ ఉంటుందని చెబుతున్నారు. తాము ఎన్డీఏ నుంచి బయటకు పోవడం లేదని చిరాగ్ పాశ్వాన్ చెబుతున్నారు. నితీష్ కుమార్ కు మాత్రమే తాము వ్యతిరేకమని, బీజేపీకి అనుకూలమనే అంటున్నారు. తన తండ్రి పదవి పోతుందనే చిరాగ్ పాశ్వాన్ ఈ పల్లవి అందుకున్నారని సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చిరాగ్ పాశ్వాన్ అనుభవజ్ఞుడైన నితీష్ కుమార్ ను సవాల్ చేస్తుండటం రాజీకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News