చిరాగ్ బాగా చిరాకు తెప్పిస్తున్నారుగా?
లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్ ఎన్టీఏ నుంచి బయటకు వచ్చి సొంతంగా పోటీ చేస్తున్నారు. తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి బాగా వస్తుందని [more]
లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్ ఎన్టీఏ నుంచి బయటకు వచ్చి సొంతంగా పోటీ చేస్తున్నారు. తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి బాగా వస్తుందని [more]
లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్ ఎన్టీఏ నుంచి బయటకు వచ్చి సొంతంగా పోటీ చేస్తున్నారు. తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి బాగా వస్తుందని చిరాగ్ పాశ్వాన్ ఆశిస్తున్నారు. ప్రధానంగా ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన ప్రధాన కారణం ముఖ్యమంత్రి నితీష్ కుమార్. దీంతో తన ఎన్నికల ప్రచారం మొత్తాన్ని చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్ పైనే చేస్తున్నారు. ఆయన పాలనపై విమర్శలు చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకూ…..
నిన్న మొన్నటి వరకూ చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ కూటమిలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చినంత మాత్రాన ప్రభుత్వ వైఫల్యాల్లో భాగం ఉండకపోతుందా? నితీష్ కుమార్ బీహార్ లో మద్యనిషేధాన్ని అమలు చేశారు. దీంతో మహిళలు నితీష్ కుమార్ పట్ల సానుకూలంగా ఉన్నారు. కానీ చిరాగ్ పాశ్వాన్ మాత్రం రాష్ట్రలో అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు.
ఆ విమర్శలు అప్పుడేమయ్యాయి?
దీనిపై చిరాగ్ పాశ్వాన్ పైనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇన్నాళ్లూ మిత్రపక్షం ఉన్నప్పుడు ఈ విమర్శలు ఏమయ్యాయన్న ప్రశ్నలు చిరాగ్ కే ఎదురువస్తున్నాయి. చిరాగ్ పాశ్వాన్ తన ఎన్నికల ప్రచారం మొత్తాన్ని నితీష్ కుమార్ పైనే చేస్తున్నారు. మోదీని, బీజేపీని ఒక్క మాట అనకుండానే నితీష్ కుమార్ పై విమర్శలు చేయడం ప్రజలు కూడా తప్పుపడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలను వదిలేసి నితీష్ ను టార్గెట్ చేయడమేంటన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రివర్స్ కొడుతుందా?
దీంతో పాటు చిరాగ్ పాశ్వాన్ మరో సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ ను జైలుకు పంపుతామని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నితీష్ కుమార్ నిజాయితీగా వ్యవహరిస్తున్న నేత అని, ఆయనపై ఈ రకమైన కామెంట్స్ చేసి ఉన్న అభిమానాన్ని చిరాగ్ పాశ్వాన్ కోల్పోయారని అంటున్నారు. మరోవైపు నితీష్ కమార్ మాత్రం చిరాగ్ పాశ్వాన్ ను పట్టించుకోవడం లేదు. ఆయనపైనా, లోక్ జనశక్తి పార్టీపైనా ఎటువంటి విమర్శలు చేయకపోవడం విశేషం.