వాళ్లిద్దరూ కలిస్తే ఈయన చీటీ చిరిగినట్లేనట
ఆయన కుటుంబమే రాజకీయ కుటుంబం. తండ్రి చిర్ల సోమసుందరరెడ్డి తెలుగుదేశం ఆవిర్భావంతోనే తూర్పుగోదావరి జిల్లా కొత్త పేటలో జెండా పాతేశారు. అంతకు ముందు కాంగ్రెస్ సీటుగా ఉన్న [more]
;
ఆయన కుటుంబమే రాజకీయ కుటుంబం. తండ్రి చిర్ల సోమసుందరరెడ్డి తెలుగుదేశం ఆవిర్భావంతోనే తూర్పుగోదావరి జిల్లా కొత్త పేటలో జెండా పాతేశారు. అంతకు ముందు కాంగ్రెస్ సీటుగా ఉన్న [more]
ఆయన కుటుంబమే రాజకీయ కుటుంబం. తండ్రి చిర్ల సోమసుందరరెడ్డి తెలుగుదేశం ఆవిర్భావంతోనే తూర్పుగోదావరి జిల్లా కొత్త పేటలో జెండా పాతేశారు. అంతకు ముందు కాంగ్రెస్ సీటుగా ఉన్న దాన్ని పసుపుపరం చేశారు. ఇక ఆయనకు 1985లో టికెట్ దక్కపోవడంతో కాంగ్రెస్‌లో చేరిపోయారు. 1989లో ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి సత్తా చాటారు. ఇక ఆయన రాజకీయ వారసుడిగా చిర్ల జగ్గిరెడ్డి 2004లో అదే కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగ్రేట్రం చేశారు. ఎమ్మెల్యేగా ఫస్ట్ టైమ్ గెలిచారు. ఆయన కేవలం 26 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయిపోయారు. చిర్ల జగ్గిరెడ్డి ముందునుంచి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగానే ఉంటూ వచ్చారు. 2009 ఎన్నికల్లో ఓడిన ఆయన వైసీపీ ఏర్పాటుతోనే అందులో చేరిపోయారు.
వరసగా రెండుసార్లు….
2014, 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి చిర్ల జగ్గిరెడ్డి గెలిచారు. జిల్లాలో బలమైన పునాదులు వేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ రాజకీయం పూర్తిగా ఇద్దరు వ్యక్తుల మధ్యన కేంద్రీకృతమై ఉందని చెప్పాలి. ప్రస్తుత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు వర్సెస్ చిర్ల ఫ్యామిలీగా సాగుతూ వస్తోంది. బండారు బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు. అయినా సరే ఆయన్ని ఢీ కొట్టి చిర్ల జగ్గిరెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడ కాపుల ప్రాధాన్యత ఎక్కువ. ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో బండారు గెలిచారు. ఆ తరువాత ఆయన తిరిగి టీడీపీలో చేరిపోయారు. ఇక బండారు గత పదేళ్ళుగా మాజీ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన్ని ఆలా ఉంచడంతో చిర్ల జగ్గిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు.
బలమైన అనుచర వర్గం….
వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన చిర్ల జగ్గిరెడ్డికి బలమైన అనుచరవర్గం ఉంది. దాంతో పాటు తండ్రి కాలం నాటి రాజకీయ పునాది కూడా ఉంది. దాంతో ఈ యువ ఎమ్మెల్యే వరస విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నారు. 2024లో కూడా మళ్లీ ఇక్కడ నుంచి గెలిచి జెండా ఎగరేయాలని చూస్తున్నారు. విచిత్రం ఏంటంటే 2014లో కేవలం 700 ఓట్లతో గెలిచిన చిర్ల జగ్గిరెడ్డి, 2019 ఎన్నికల్లో కూడా హోరాహోరీ పోరులోనే గెలిచారు. గత ఎన్నికల్లో చిర్లకు బండారుకు మధ్య ఓట్ల తేడా కేవలం నాలుగు వేల లోపే ఉంది. పైగా జనసేన ఇక్కడ 35 వేల ఓట్లను సాధించింది. ఈ లెక్కలను కనుక పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికలు చిర్ల జగ్గిరెడ్డికి టఫ్ గానే ఉంటాయని చెప్పాలి.
ఆ పొత్తు కుదిరితే…?
ఆనాటికి వైసీపీ సర్కార్ మీద యాంటీ ఇంకెంబెన్సీ కూడా బాగా పెరుగుతుంది. అదే సమయంలో జనసేన, టీడీపీ కనుక పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా ఇక్కడ వైసీపీకి పెద్ద దెబ్బ పడుతుంది అంటున్నారు. ఇక చిర్ల జగ్గిరెడ్డి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. వైసీపీకి గత ఎన్నికల్లో కాపులు పూర్తి మద్దతుగా నిలిచారు. కానీ ఈసారి అది సాధ్యపడకపోవచ్చు అంటున్నారు. మొత్తానికి చిర్ల జగ్గిరెడ్డి ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచాక… పార్టీ కూడా అధికారంలో ఉండడంతో ఇసుక, ఇతరత్రా వ్యవహారాల్లో నియోజకవర్గంలో దూకుడుగా ఉంటున్నారు.
టీడీపీలోనూ…?
మరోవైపు బండారు సీనియర్ నేత అయినప్పటికి రాజకీయంగా గతంలో ఉన్నంత యాక్టివ్‌గా అయితే ఉండడం లేదు. ఈ సారి ఆయన పోటీ చేస్తారా ? లేదా ? అన్న సందేహం ఉంది. మరోవైపు రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా ఈ సారి కొత్తపేట సీటును టీడీపీ వరకు శెట్టిబలిజల కోటాలో దక్కించుకునేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా గత రెండు ఎన్నికల్లాగానే ఈ సారి కూడా కొత్తపేట రాజకీయం ఉత్కంఠగానే ఉండే ఛాన్సులే ఉన్నాయి