చిరాగ్ కు చివరి ఛాన్స్ ఇదేనా?
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో లోక్ జనశక్తి పార్టీ భవితవ్యం బీహార్ ఎన్నికల్లో తేలనుంది. రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ గత [more]
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో లోక్ జనశక్తి పార్టీ భవితవ్యం బీహార్ ఎన్నికల్లో తేలనుంది. రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ గత [more]
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో లోక్ జనశక్తి పార్టీ భవితవ్యం బీహార్ ఎన్నికల్లో తేలనుంది. రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ గత కొన్నేళ్లుగా పార్టీని హ్యాండిల్ చేస్తున్నప్పటికీ తండ్రికి ఉన్న ఇమేజ్ చిరాగ్ కు లేదన్నది వాస్తవం. అయితే దళిత నేతగా ముద్రపడిన రామ్ విలాస్ పాశ్వాన్ స్థాయిలో చిరాగ్ పాశ్వాన్ పేరు తెచ్చుకోలేరన్నది పార్టీ వర్గాలు కూడా అంగీకరిస్తున్న విషయమే.
తండ్రి మరణంతో….
అయితే లోక్ జనశక్తి పార్టీ తరుపున రామ్ విలాస్ పాశ్వాన్ మొన్నటి వరకూ కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు. అయితే ఆయన ఆకస్మిక మరణంతో ఆ పార్టీకి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంది. దళితులను దూరం చేసుకోకూడదన్న కారణంగా బీజేపీ లోక్ జనశక్తి పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని భావిస్తుంది. అయితే బీహార్ ఎన్నికల్లో లోక్ జనకశక్తి పార్టీ ఎన్డీఏ నుంచి దూరంగా జరిగింది. నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా చిరాగ్ పాశ్వాన్ పోరాడుతున్నారు.
కేంద్రమంత్రివర్గంలోకి….
రామ్ విలాస్ పాశ్వాన్ స్థానంలో ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవాలన్న ఆలోచన కూడా బీజేపీకి ఉంది. అయితే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయానికి చిరాగ్ పాశ్వాన్ గండి కొట్టారని భావిస్తే బీజేపీ ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం కష్టమే అవుతుందంటున్నారు.
ఫలితాలను బట్టే…..
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ కావాల్సిన స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి తోడ్పడితే ఆయనను ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్నది బీజేపీ వర్గాల నుంచి విన్పిస్తున్న మాట. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పూర్తిగా తండ్రి సానుభూతిపైనే ఆధారపడి ఉన్నారు. పాశ్వాన్ ఇమేజ్ పనిచేసి కొన్ని స్థానాలను సాధించగలిగితే చిరాగ్ పాశ్వాన్ రాజకీయాలలో నిలదొక్కుకుంటారు. లేకుంటే మాత్రం ఆయన రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడటం తద్యమంటున్నారు పరిశీలకులు.