మంచు రాయబారం అందుకేనా?

సినీనటుడు మోహన్ బాబు కుటుంబంతో కలసి ప్రధాని మోదీని కలవడం చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు రాజకీయపరమైన కారణాలేవీ లేవని మోహన్ బాబు చెబుతున్నా మోదీ చెవిలో మోహన్ [more]

Update: 2020-01-07 05:00 GMT

సినీనటుడు మోహన్ బాబు కుటుంబంతో కలసి ప్రధాని మోదీని కలవడం చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు రాజకీయపరమైన కారణాలేవీ లేవని మోహన్ బాబు చెబుతున్నా మోదీ చెవిలో మోహన్ బాబు ఏమి ఉది ఉంటారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మోదీతో మాట్లాడి వచ్చిన తర్వాత తాను పార్టీ మారే ఆలోచన లేదని చెప్పేశారు. అంతేకాదు గత ఎన్నికల్లో తాను ఏపీ ఎన్నికల్లో జగన్ కు మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

చిరంజీవి సూచన మేరకే….

అయితే ఫిలిం ఇండ్రస్ట్రీ అభిప్రాయాన్ని తెలియజెప్పేందుకే మోహన్ బాబు ప్రధాని మోదీని కలిశారన్న ప్రచారం జరగుతోంది. విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేషన్ రాజధాని చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి సూచన మేరకు మోహన్ బాబు ప్రధాని మోదీని కలిశారని టాక్. విశాఖపట్నానికి రాజధానిని తరలించడానికి ఏపీ తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ సుముఖంగా ఉందని ప్రధాని మోదీకి తెలియజేయాలని చిరంజీవి మోహన్ బాబుకు సూచించారు.

టాలీవుడ్ అభిప్రాయంగా….

మోహన్ బాబు, చిరంజీవి మంచి మిత్రులు. చిరంజీవి ఇప్పటికే మూడు రాజధానుల ప్రతిపాదనను బహిరంగంగానే సమర్థించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రతిపాదనపై ఎలాంటి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు మోహన్ బాబు ద్వారా మోదీ వద్దకు సమచారాన్ని పంపారని అంటున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఆర్థిక పరంగా కూడా ఏపీ ప్రభుత్వం చిక్కులను అధిగమిస్తుందని మోహన్ బాబు ప్రధాని మోదీకి వివరించినట్లు తెలిసింది.

మోదీకి సమ్మతిని…

విశాఖను రాజధానిగా మార్చేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు వెలువడకుండా ఉండేందుకు మోహన్ బాబును టాలీవుడ్ రాయాబారిగా మోదీ వద్దకు పంపినట్లు చెబుతున్నారు. నిన్న ప్రధాని మోదీని మోహన్ బాబు కలిసినప్పుడు ఆయన వెంట రాఘవేంద్ర రావు కూడా ఉన్నారు. దీంతో టాలీవుడ్ మొత్తం విశాఖ కు రాజధానిని తరలించడాన్ని సమర్థిస్తూ తమ సమ్మతిని మోదీకి తెలియజేశారని చెబుతున్నారు. మొత్తం మీద ఈ సమయంలో మోదీని మోహన్ బాబు కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News