టాస్క్ పెద్దదే… కానీ ఈయన వల్ల అవుతుందా?
సీఎం రమేష్ కడప జిల్లాలో కీలక నేత. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కింగ్ గా మెలిగిన నేత. అయితే ఇప్పుడు ఆయన ఎందుకూ పనికిరాకుండా పోయారు. బీజేపీలో [more]
;
సీఎం రమేష్ కడప జిల్లాలో కీలక నేత. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కింగ్ గా మెలిగిన నేత. అయితే ఇప్పుడు ఆయన ఎందుకూ పనికిరాకుండా పోయారు. బీజేపీలో [more]
సీఎం రమేష్ కడప జిల్లాలో కీలక నేత. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కింగ్ గా మెలిగిన నేత. అయితే ఇప్పుడు ఆయన ఎందుకూ పనికిరాకుండా పోయారు. బీజేపీలో ఆయన చెబితే వినే పరిస్థితి లేదు. అయితే సీఎం రమేష్ కు రాజ్యసభ పదవి 2023 వరకూ ఉంది. దీంతో ఆయన కొంత వరకూ ఊపిరి పీల్చుకున్నట్లే. బీజేపీలో కొనసాగితే మళ్లీ రాజ్యసభ పదవి వస్తుందన్న గ్యారంటీ లేదు. అలాగని సీఎం రమేష్ కు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యమూ లేదు.
బీజేపీలోనే కొనసాగితే?
నిజమే.. పారిశ్రామికవేత్తలకు, లాబీయింగ్ చేసేవారికి తెలుగుదేశం పార్టీయే అనుకూలం. ఆ పార్టీలో ఉంటే ఖచ్చితంగా పదవి దక్కుతుందన్న ఆశ ఉంటుంది. కానీ బీజేపీలో అలాంటి అవకాశాలుండవు. అక్కడ క్వాలిఫికేషన్ డబ్బులు కాదు. కేవలం పార్టీ ట్యాగ్ మాత్రమే. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి బీజేపీ రాజ్యసభ పదవి ఇస్తుంది. అంటే ఆ క్వాలిఫికేషన్లు ఏవీ మనోడి దగ్గర లేవు. దీంతో సీఎం రమేష్ కు మరోసారి రాజ్యసభ పదవి బీజేపీ నుంచి అయితే రాదు.
రెండు పార్టీలను కలిపి….
ఇక ఆయనకు ఉన్న ఏకైక మార్గం తిరిగి టీడీపీలో చేరడమే. కానీ టీడీపీ పరిస్థితి బాగా లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నైరాశ్యం కన్పిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి కోలుకుంటుందని చెప్పలేని పరిస్థితి. అయితే సీఎం రమేష్ లో ఒకే ఒక ఆశ. టీడీపీ, బీజేపీ, జనసేన కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని. ఇందుకోసం ఆయన ఢిల్లీలో లాబీయింగ్ బాగానే చేస్తున్నారని వినికిడి. వైసీపీ ప్రభుత్వం పై ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడంలోనూ సీఎం రమేష్ ముందుంటున్నారు.
అదే పనిలో…..?
పొత్తు కుదిరితేనే తనకు భవిష్యత్ ఉంటుందని సీఎం రమేష్ కు తెలియంది కాదు. ఆ తర్వాత నెమ్మదిగా టీడీపీ నుంచి రాజ్యసభ పదవిని రెన్యువల్ చేయించుకునే వీలుంటుంది. అందుకే ఇప్పుడు సీఎం రమేష్ టాస్క్ అంతా బీజేపీ, టీడీపీలను కలపడమే. సుజనా చౌదరితో కలసి ఆయన ఢిల్లీ పెద్దలను తరచూ కలుస్తూ చంద్రబాబు పట్ల సదభిప్రాయం నెలకొనేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కనీసం జేపీ నడ్డాతోనైనా చంద్రబాబును కలపాలన్న ప్రయత్నంలో సీఎం రమేష్ ఉన్నారని తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.