కామ్రేడ్లు…కనువిప్పు కలగలేదా?
చారిత్రక తప్పిదాలకు కేరాఫ్ గా మారిపోయిన కమ్యూనిస్టు పార్టీలు, ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఏపీలో జ రుగుతున్న రాజధాని విషయంలో కూడా తలాతోక లేకుండా ప్రచారం [more]
;
చారిత్రక తప్పిదాలకు కేరాఫ్ గా మారిపోయిన కమ్యూనిస్టు పార్టీలు, ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఏపీలో జ రుగుతున్న రాజధాని విషయంలో కూడా తలాతోక లేకుండా ప్రచారం [more]
చారిత్రక తప్పిదాలకు కేరాఫ్ గా మారిపోయిన కమ్యూనిస్టు పార్టీలు, ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఏపీలో జ రుగుతున్న రాజధాని విషయంలో కూడా తలాతోక లేకుండా ప్రచారం వస్తే చాలు తమ ఫొటోలు పేపర్ల లో పడితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు, విమర్శలు వస్తున్నాయి. రాజధాని విషయాన్ని తీసుకుంటే టీడీపీ కన్నా వైసీపీ కన్నా ముందు నుంచి ఏపీకి ఎలాంటి రాజధాని ఉండాలి? ఎక్కడ ఉండాలి? అనే విషయాల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు బాధ్యతగా వ్యవహరించాయి. ఇప్పటి నారాయణ వంటి నాయకుల మాదిరిగా వ్యవహరించడం, వ్యాఖ్యలు చేయడం వంటివి కమ్యూనిస్టులకు అప్పట్లో చేతకాదనే చెప్పాలి.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం….
ఈ నేపథ్యంలో 1938లో కుదిరిన శ్రీబాగ్ ఒడంబడికకు అప్పటి కమ్యూనిస్టులు జైకొట్టారు. కర్నూలు కుదిరితే రాజధాని లేదంటే హైకోర్టు ఉంటే ఇక్కడి సీమ ప్రాంతాలు డెవలప్ అవుతాయని అన్నారు. అయితే, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, తెలంగాణను కలుపుకోవడంతో హైదరాబాద్ రాజధాని అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సీమ ప్రాంతాలు అట్టడుగు స్థానంలోనే కొట్టుమిట్టాడుతున్నా యి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కర్నూలుకు హైకోర్టును కేటాయించి న్యాయ రాజధానిగా నిర్ణయించాలని భావిస్తోంది.
సీపీఐ మాత్రం….
అదే సమయంలో విశాఖలో పాలనా రాజధానికి ప్లాన్ చేస్తోంది. ఇక, అమరావతిలో అసెంబ్లీ సహా ఇతర వ్యవహారాలు నడుస్తాయని చెబుతోంది. అయితే, గత విధానాలకు బిన్నంగా ఇప్పుడు కమ్యూనిస్టులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్నూలుకు హైకోర్టుతో ఒరిగేది లేదన్న కామ్రేడ్లు (ముఖ్యంగా సీపీఐ ఈవిషయంలో దూకుడుగా ఉంది) అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తుండడం, నిజంగానే కమ్యూనిస్టు సానుభూతిపరులు కూడా విమర్శలు చేసే అవకాశం ఇచ్చినట్టుగా మారింది. ఇక, అమరావతి విషయంలో ఓ వర్గానికి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తు న్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు జోరందుకున్నాయి.
మళ్లీ చేతులు కలపడం….
ఈ సమయంలో తటస్థంగా ఉండి తమ ఉనికిని కాపాడుకోవాల్సిన కమ్యూనిస్టులు.. ఒక్కసారిగా రాజధాని ఉద్యమంలోకి దూకేశారు. ప్రజలకు మద్దతిస్తున్నారు. ఇది మంచిదే అయినా.. చంద్రబాబుతో మళ్లీ చేతులు కలపడం, ఆయన పక్కనే సీట్లు పంచుకోవడం వంటివి.,. కమ్యూనిస్టు సానుభూతి పరులకు నిజంగానే ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. అసలు అమరావతిలో ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉందా? వంటి విషయాలను పక్కదారి పట్టకుండా కాచుకోవాల్సిన కమ్యూనిస్టులు.. తామే పక్కదారి పట్టడం.. మరో చారిత్రక తప్పిదం కాదా? అనే ప్రశ్నలు ఉదయించేలా చేస్తోంది.