షాక్ ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యం లేదట
తెలంగాణలో వరసగా జరుగుతున్న ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా నల్లగొండ, వరంగల్, [more]
;
తెలంగాణలో వరసగా జరుగుతున్న ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా నల్లగొండ, వరంగల్, [more]
తెలంగాణలో వరసగా జరుగుతున్న ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్ గెలుపు సాధ్యం అవుతుందా? లేదా? అన్నది సందేహంగా మారింది. అన్ని పార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఎన్నిక జరిగితే గెలుపు ఎవరదనేది అంచనా వేయడం కూడా కష్టంగా మారింది.
సిట్టింగ్ స్థానం కావడంతో…..
ప్రస్తుతం ఈ స్థానం అధికార పార్టీ చేతుల్లో ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ చెమటోడ్చక తప్పదంటున్నారు. మూడు ప్రాంతాల్లో పార్టీలు బలంగా ఉండటమే ఇందుకు కారణం. ఖమ్మం జిల్లా ను తీసుకుంటే ఇక్కడ వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్ కూడా బలంగా ఉన్నాయి. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నిక సవాల్ గా మారనుంది.
మరోసారి ఆయనే…..
మరోసారి టీఆర్ఎస్ ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఇప్పటి నుంచి మూడు జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతును కూడగడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కోదండరామ్ కు అన్యాయం జరిగిందని ఎక్కువ మంది అభిప్రాయపడుతుండటంతో ప్రొఫెసర్ కు కొంత అడ్వాంటేజీ ఉండే అవకాశముందంటున్నారు.
ఓట్ల చీలికపైనే…..
ఇక బీజేపీ కూడా ఇక్కడ పోటీలో ఉంటున్నప్పటికీ ఈసారి పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవంటున్నారు. ఇదే స్థానంలో గత ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కానీ ఈసారి ఆ వాతావరణం లేదు. ఇక ఖమ్మం జల్లాలో బలంగా ఉన్న కమ్యునిస్టు పార్టీలు రెండూ కలసి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించాయి. కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ కు మద్దతిస్తుందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పుడు అనేక మంది పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంపైనే అధికార టీఆర్ఎస్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు కన్పిస్తుంది. మొత్తం మీద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.