బాబోయ్.. బెజవాడ… బెంబేలెత్తిస్తుందిగా?
కరోనా వైరస్ తో బెజవాడ బెంబేలెత్తిపోతుంది. కరోనా వైరస్ తీవ్రత బెజవాడ నగరంలో ఎక్కువగా కన్పిస్తుంది. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారితోనే కాకుండా ఇతర [more]
;
కరోనా వైరస్ తో బెజవాడ బెంబేలెత్తిపోతుంది. కరోనా వైరస్ తీవ్రత బెజవాడ నగరంలో ఎక్కువగా కన్పిస్తుంది. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారితోనే కాకుండా ఇతర [more]
కరోనా వైరస్ తో బెజవాడ బెంబేలెత్తిపోతుంది. కరోనా వైరస్ తీవ్రత బెజవాడ నగరంలో ఎక్కువగా కన్పిస్తుంది. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారితోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా ఈ వ్యాధిసోకడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ట్రేస్, టెస్ట్, ట్రీట్ వంటి మూడు సూత్రాలను కరనా వైరస్ విషయంలో పకడ్బందీగా అమలు చేస్తున్నప్పటికీ బెజవాడలో మాత్రం వైరస్ అదుపులోకి రాలేదు.
తొలుత మర్కజ్…
తొలుత మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారికి పరీక్షలు జరిపారు. కొందరికి పాజిటివ్ రావడంతో వారితో పాటు వారి సంబంధీకులను కూడా క్వారంటైన్ కు తరలించారు. విస్తీర్ణంలో తక్కువగా జనాభా అధికంగా ఉన్న నగరం కావడంతో ప్రభుత్వం ముందునుంచి బెజవాడపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా వైరస్ విస్తరించే అవకాశాలున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకుంది. అయినా విజయవాడలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గించే అంశమే.
సగంపైగా కేసులు…..
కృష్ణా జిల్లా వ్యాప్తంగా నమోదయిన కేసుల్లో సగానికి పైగా విజయవాడ నగరంలోనే నమోదవుతున్నాయి. దీంతో అధికారులు కొన్ని రోజుల నుంచి కంటెయిన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. కృష్ణలంక, మధురనగర్, భవానీపురం, కేదాశ్వరిపేట, విద్యాధరపురం పలు ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో గత రెండు ఆదివారాల నుంచి విజయవాడలో మాసం మార్కెట్లను కూడా అధికారులు బంద్ చేసేశారు. లాక్ డౌన్ సమయాన్ని కూడా కుదించారు.
లారీ డ్రైవర్ తో……
మర్కజ్ మసీదు ఘటనను మర్చిపోకముందే ఒక లారీ డ్రైవర్ చేసిన నిర్వాకం వల్ల అనేక మంది వ్యాధికి గురయ్యారు. కోల్ కత్తా నుంచి వచ్చిన లారీ డ్రైవర్ కు కరోనా వ్యాధిసోకింది. అయితే ఆయన అప్పటికే అనేకమందిని కలిశారు. లారీ డ్రైవర్ తో కాంటాక్ట్ అయిన 18 మందికి వైరస్ సోకడంతో అందరినీ క్వారంటైన్ కు తరలించారు. ఒక హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో కూడా ఈ వ్యాధి కొందరికి సోకినట్లు నిర్థారణ కావడంతో అక్కడ పనిచేస్తున్న హమాలీలందరినీ క్వారంటైన్ కు తరలించారు. ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వం ఎంత చేసినా కరోనాను కంట్రోల్ చేయడం కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బెజవాడలో ఒక్కరోజే యాభై కేసులు నమోదు చేసుకోవడం ఆందోళన కల్గించే విషయమే.
.