డిసైడ్ అయ్యారట

సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముందు మూడు ఆప్షన్లు కన్పిస్తున్నాయి. ఒకటి కుటుంబం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం. రెండోది బీజేపీలోకి వెళ్లిపోవడం. మూడోది తాను [more]

;

Update: 2019-10-26 05:00 GMT

సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముందు మూడు ఆప్షన్లు కన్పిస్తున్నాయి. ఒకటి కుటుంబం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం. రెండోది బీజేపీలోకి వెళ్లిపోవడం. మూడోది తాను రాజీకయ సన్యాసం స్వీకరించడం. ఈ మూడు ఆప్షన్లలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మూడో ఆప్షన్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఇటు పురంద్రీశ్వరి, అటు తన కుమారుడు హితేశ్ చెంచురామ్ రాజకీయ భవిష్యత్ కు ఢోకా ఉండదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావిస్తున్నారు. అనుచరులతో కలసి సమావేశమయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిసింది.

కండిషన్ల గురించి….

దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీ నుంచి కండిషన్ వచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబం మొత్తం వైసీపీలోకి రావాలని, లేకుంటే పార్టీ లో నుంచి వెళ్లిపోవాలని పరోక్షంగా సంకేతాలు జగన్ సయితం పంపారు. దీంతో బీజేపీలో ప్రాముఖ్యత ఉన్న పురంద్రీశ్వరిని ఆ పార్టీ నుంచి వచ్చేయమనడం దగ్గుబాటికి ఇష్టంలేదు. అలాగని మొత్తం బీజేపీలోకి వెళితే పర్చూరు నియోజకవర్గంలో ఏమీ చేయలేని పరిస్థితి. తన క్యాడర్ కు కూడా న్యాయం చేయలేను. దీంతో ఆయన రాజకీయ సన్యాసం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

ఆ నిర్ణయానికే….

అయితే ఇక్కడ తాను రాజకీయ సన్యాసం తీసుకుంటే పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను వేరేవారికి అప్పగిస్తారని తెలుసు. అందుకనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆచి తూచి వ్యవహరిస్తున్నారంటున్నారు. పురంద్రీశ్వరి బీజేపీకి రాజీనామా చేసే ప్రసక్తి ఉండదని ఇప్పటికే తన సన్నిహితుల వద్ద దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పినట్లు తెలిసింది. అయితే హితేశ్ విషయమే ఆయన డీప్ గా ఆలోచిస్తున్నారు. బీజేపీలోకి వెళితే హితేశ్ రాజకీయ భవిష్యత్తు ఏమాత్రం బాగుండదు. అందుకే వైసీపీయే బెటరన్నది దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆలోచన.

జగన్ కలిసేందుకు…..

అందుకే మరోసారి దగ్గుబాటి వెంకటేశ్వరావు మరోసారి జగన్ ను కలసి తన మనసులో మాటను చెప్పనున్నట్లు తెలుస్తోంది. తాను రాజీకీయాలకు పూర్తిగా స్వస్తి చెబుతానని, తన కుమారుడు హితేశ్ కు మాత్రం వైసీపీలో కొనసాగనివ్వాలని కోరనున్నట్లు తెలిసింది. ఇందుకోసం దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ అపాయింట్ మెంట్ కూడా కోరినట్లు సమాచారం. ఇప్పటికే విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసులురెడ్డితో కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చర్చించినట్లు చెబుతున్నారు. కానీ వారిద్దరూ ఇది జగన్ తేల్చాల్సిన విషయమని చెప్పడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక విషయం మాత్రం నిజం దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకునేందుకు మాత్రం డిసైడ్ అయ్యారు.

Tags:    

Similar News