ఉన్నట్లా…? లేనట్లా?

దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా? లేనట్లా? ఇప్పుడు ఇదే అనుమానం సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను రాజకీయాల [more]

;

Update: 2019-11-20 15:30 GMT

దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా? లేనట్లా? ఇప్పుడు ఇదే అనుమానం సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేశారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి ఫోన్ చేసి మరీ తాను వైసీపీ ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటానని కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పేశారు. తర్వాత సైలెంట్ అయిపోయారు.

రాజకీయ సన్యాసమంటూ….

ఇక పర్చూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేేసేందుకు వైసీపీ అధినేత జగన్ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసులురెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలను అప్పగించారు. అక్కడ సరైన నేతను ఎంపిక చేయాలని ఆదేశించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీద అనుమానం కలిగే ముందుగానే అక్కడ గతంలో వైసీపీ ఇన్ ఛార్జిగా పనిచేసిన రావి రామనాధం బాబును పార్టీలోకి తీసుకు వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కేవలం తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, వైసీపీ ఇతర నేతలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

పురంద్రీశ్వరి విషయంలోనూ….

దీంతో పాటు దగ్గుబాటి పురంద్రీశ్వరి జగన్ ప్రభుత్వంపై తరచూ చేస్తున్న విమర్శలు కూడా వైసీపీిని ఇరకాటంలో నెట్టేశాయి. అందుకే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు జగన్ షరతులు విధించారు. పురంద్రీశ్వరిని వైసీపీలోకి తీసుకురావాలని, లేకుంటే పార్టీలో కొనసాగే విషయంపై ఆలోచించుకోవాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు జగన్ కటువుగా చెప్పడంతో ఆయన రాజకీయ సన్యాసమే బెటరని నిర్ణయానికి వచ్చేశారు. అదే విషయాన్ని వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డితో చెప్పేశారు.

కామెంట్స్ చేయకుండా……

అదేమి చిత్రమో కాని ఈ వివాదం జరిగిన నాటి నుంచి పురంద్రీశ్వరి వైసీపీ సర్కార్ పై కామెంట్స్ చేయడం లేదు. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరులో అందరినీ కలుపుకుని పోయేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇలా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొంత తగ్గినట్లే కన్పిస్తున్నారు. తనకు ప్రత్యర్థిగా రావి రామనాధం బాబును రంగంలోకి దింపుతారని గ్రహించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పడు రూటు మార్చినట్లు కన్పిస్తుంది. అందుకే పర్చూరు పంచాయతీని వైసీపీ కొంతకాలం పక్కన పెట్టేలా కన్పిస్తుంది.

Tags:    

Similar News