Badvel : డాక్టర్ కు జనం పల్స్ తెలిసిపోయిందా?
బద్వేలు ఉప ఎన్నికకు సమయం దగ్గరపడింది. నేతలు ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నారు. డాక్టర్ దాసరి సుధ వైసీపీ అభ్యర్థిగా దాదాపు మూడు నెలల నుంచి ప్రజల్లోనే [more]
;
బద్వేలు ఉప ఎన్నికకు సమయం దగ్గరపడింది. నేతలు ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నారు. డాక్టర్ దాసరి సుధ వైసీపీ అభ్యర్థిగా దాదాపు మూడు నెలల నుంచి ప్రజల్లోనే [more]
బద్వేలు ఉప ఎన్నికకు సమయం దగ్గరపడింది. నేతలు ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నారు. డాక్టర్ దాసరి సుధ వైసీపీ అభ్యర్థిగా దాదాపు మూడు నెలల నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో వచ్చిన ఈ ఎన్నికలలో దాసరి సుధను పార్టీ హైకమాండ్ వైసీీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే ఆమె జనంలో ఉండటం, భర్త మరణంతో వచ్చిన సానుభూతితో తన గెలుపు సునాయాసమని దాసరి సుధ భావిస్తున్నారు.
గైనకాలజిస్టుగా….
దాసరి సుధ గైనకాలజిస్టు. డాక్టర్ చదవి మరో డాక్టర్ వెంకటసుబ్బయ్యను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలసి కడప లో ప్రయివేటు ప్రాక్టీస్ ను నిర్వహిస్తూ సుపరిచితులయ్యారు. డాక్టర్ దాసరి సుధ గైనకాలజిస్టు కావడంతో జిల్లా నలుమూలల నుంచి వైద్యం కోసం ఆమె వద్దకు తరలి రావడం, బద్వేలు నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో దాసరి సుధ వద్దకు వస్తుండటంతో ఆ పరిచయాలు మరింత అనుకూలిస్తాయని చెబుతున్నారు.
రెండేళ్ల నుంచి రాజకీయాల్లో….
దాసరి సుధ తొలిసారి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా గత రెండేళ్ల నుంచి తన భర్తతో కలసి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆమెకు అది ప్లస్ పాయింట్. మరోవైపు ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించారు. గత ఎన్నికల్లో వెంకటసుబ్బయ్యకు 44 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీని అధిగమించాలన్న కసితో దాసరి సుధ నియోజకవర్గమంతా పర్యటన చేస్తున్నారు.
గెలుపు ఖాయమంటూ….
డాక్టర్ దాసరి సుధ ఏక పక్ష విజయం సాధించే అవకాశముంది. టీడీపీ బరి నుంచి తప్పుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. అయితే వైసీపీ మాాత్రం మెజారిటీపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. రికార్డు స్థాయి మెజారిటీ కోసం వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఏక పక్ష విజయంతో ప్రజల్లోకి వైసీపీ ఇమేజ్ చెక్కు చెదరలేదన్న సంకేతాలను నేతలు పంపాలనుకుంటున్నారు.