షాక్…మామూలుగా లేదుగా

త‌న‌కున్న అధికారాన్నివినియోగించుకుని జిల్లా మొత్తాన్ని త‌న పార్టీ కార్యాల‌యంగా చేసుకుని, అధికారుల‌ను, నాయకు ల‌ను కూడా త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకున్న ఫ‌లితం ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని [more]

;

Update: 2019-07-18 09:30 GMT

త‌న‌కున్న అధికారాన్నివినియోగించుకుని జిల్లా మొత్తాన్ని త‌న పార్టీ కార్యాల‌యంగా చేసుకుని, అధికారుల‌ను, నాయకు ల‌ను కూడా త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకున్న ఫ‌లితం ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమను వెంటాడుతోంది. ఆయ‌న ప్రస్తుత ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు. దేవినేని వ్యవ‌హారం నేడు వివాదాస్పదం కావ‌టం కాదు.. టీడీపీ అధికారం లోకి వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే ఆయ‌న‌పై పార్టీ నేత‌ల్లో అసంతృప్తి ఏర్పడింది. సోద‌రుడు దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ హ‌ఠాన్మర ణంతో రాజ‌కీయంగా తెర‌మీదికి వ‌చ్చిన దేవినేని 1999 ఎన్నిక‌ల్లో కృష్ణాజిల్లా నందిగామ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో వ‌సంత కృష్ణప్రసాద్ ను ఓడించారు. అప్పటికి ముందు వ‌సంత ఫ్యామిలీ టీడీపీలోనే ఉంది.

ఇద్దరికీ పచ్చగడ్డి వేస్తే….

వ‌సంత నాగేశ్వర‌రావు.. రైతు నేత‌గా, రాష్ట్ర హోం శాఖ మంత్రిగా కూడా చేశారు. అయితే, దేవినేని ఫ్యామిల‌తో తీవ్రమైన విభేదాలు వ‌చ్చిన త‌ర్వాత ఈ రెండు కుటుంబాల‌కు మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్రమంలోనే వ‌సంత కృష్ణ ప్రసాద్ ఓడించారు. ఇక‌, 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో నందిగామ రిజ‌ర్వ్ కావ‌డంతో త‌న మకాంను మైల‌వ‌రానికి మార్చుకున్నారు దేవినేని. ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫు వ‌రుసగా రెండుసార్లు విజ‌యం సాధించారు.

మీడియాకు దూరంగా….

ఇక తాజా ఎన్నిక‌ల్లో వసంత వారసుడిగా వైసీపీలో చేసిన కేపీ(కృష్ణ ప్రసాద్‌) ఏరికోరి మ‌రీ దేవినేని పోటీ చేస్తున్న మైల‌వ‌రం టికెట్‌ను తెచ్చుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు దేవినేని వ‌ర్సెస్ వసంత కుటుంబాల మ‌ధ్య మైల‌వ‌రంలో తీవ్రమైన‌ విభేదాలు చోటు చేసుకున్నాయి. జ‌గ‌న్ విజ‌యవాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాల‌ని సూచించినా.. కేపీ వ‌ద్దని మైల‌వ‌రం నుంచి పోటీ చేసి , దేవినేనిని మ‌ట్టి క‌రిపించారు. దీంతో ఇప్పుడు దేవినేని ఓట‌మి భారంతో కుంగిపోతున్నారు. గ‌తంలో నిత్యం మీడియా లేనిదే ఎక్కడికీ వెళ్లని దేవినేని.. ఇప్పుడు మాత్రం మీడియా కంట ప‌డ‌కుండా త‌ప్పించుకుంటున్నారు.

వ్యతిరేకత పెరిగి….

ఇక‌, పార్టీలోనూ దేవినేని అంటే గౌర‌వించే వారు కూడా క‌రువ‌య్యారు. ముఖ్యంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని వ‌ర్సెస్ దేవినేనిల మ‌ధ్య ట్వీట్ల యుద్ధం కూడా చోటు చేసుకుంది. దీనికితోడు తాను మంత్రి హోదాలో ఉన్నప్పుడు జిల్లాపై పూర్తి ఆధిప‌త్యం ప్రద‌ర్శించారు దేవినేని. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు అంద‌రూ దూర‌మ‌య్యారు. కొంద‌రిని మాత్రమే ద‌గ్గర చేసుకోవ‌డం, మిగిలిన వారిని పురుగుల్లా చూడ‌డంతో విజ‌య‌వాడ తూర్పు, గ‌న్నవ‌రం, అవ‌నిగ‌డ్డ వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో దేవినేనికి వ్యతిరేకత భారీగా పెరిగింది. ఇక‌, అదే స‌మ‌యంలో మైల‌వ‌రంలోనూ ఆయ‌న‌పై కింది స్థాయి నాయ‌కుల్లో తీవ్ర వ్యతిరేక‌త పెరిగింది.

చంద్రబాబు మాత్రం…..

ఆయ‌న గెలుపున‌కు గ‌త ఎన్నిక‌ల్లో తాము విశేష కృషి చేసినా.. మంత్రి హోదాలో త‌మ‌కు చిన్న సాయం కూడా చేసిపెట్టలేద‌ని త‌మ్ముళ్లు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు దేవినేనికి ఎటూ ఊసుపోవ‌డం లేదు. అయితే, కొస‌మెరుపు ఏంటంటే.. క్షేత్రస్థాయిలో ఇంత వ్యతిరేక‌త ఉన్నప్పటికీ.. పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఇప్పటికి దేవినేనికి ప్రయార్టీ ఇస్తూనే ఉండ‌డం. అయితే, వేళ్లలో బ‌లంకోల్పోయిన చెట్టుగా మారిన దేవినేని ప‌రిస్థితి మాత్రం అగ‌మ్య గోచరంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News