Dl ravindra reddy : డీఎల్ దసరాకు ఇలా షాకిస్తాడని అనుకోలేదే?
సీనియర్ రాజకీయ నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా మైదుకూరు నుంచి డీఎల్ [more]
సీనియర్ రాజకీయ నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా మైదుకూరు నుంచి డీఎల్ [more]
సీనియర్ రాజకీయ నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా మైదుకూరు నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి ఐదు సార్లు విజయం సాధించారు. ఆయన మంత్రిగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాజకీయం అంతా సాగింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
టీడీపీని భూస్థాపితం చేస్తానని….
గత ఎన్నికల సందర్భంగా డీఎల్ రవీంద్రారెడ్డి శపథం చేశారు. టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యమని చెప్పారు. అప్పట్లో ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని అమరావతిలో కలసి వచ్చారు. మైదుకూరు సీటు తనకే ఇస్తారని ఇప్పటి వరకూ డీఎల్ రవీంద్రారెడ్డి నమ్మకంగా ఉన్నారు. అయితే చంద్రబాబు నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడతో డీఎల్ టీడీపీని టార్గెట్ చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ను కూడా లోటస్ పాండ్ లో కలిశారు.
వైసీపీకి మద్దతుదారుగా….
గత ఎన్నికల్లో వైసీపీకి డీఎల్ రవీంద్రారెడ్డి మద్దతు పలికారు. తాజాగా డీఎల్ రవీంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో పోట ీచేస్తానని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో మంత్రులంతా డమ్మీలుగా మారిపోయారని డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని డీఎల్ రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
పట్టించుకోక పోవడంతో….
నిజానికి డీఎల్ రవీంద్రారెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. గత ఎన్నికల సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాష్ రెడ్డిలు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. అయితే తనను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆగ్రహం ఆయనలో కనిపించింది. తాను ఏ పార్టీలో చేరతానన్న విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ టీడీపీలో ఆయన అధికారికంగా చేరే అవకాశాులన్నాయి. మొత్తం మీద కడప జిల్లాలో జగన్ కు డీఎల్ దసరా రోజు షాక్ ఇచ్చినట్లయింది.