Dl ravindra reddy : ఆ రెండూ టిక్కెట్లు ఇవ్వవు.. ఈ రెండు ఇచ్చినా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం అప్పుడే వచ్చేసినట్లుంది. నేతలు వచ్చే ఎన్నికలకు అప్పడే సిద్దమవుతున్నారు. మేము రెడీ అంటూ క్యాడర్ కు, జనాలకు సంకేతాలు ఇస్తున్నారు. మాజీ [more]

;

Update: 2021-10-24 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం అప్పుడే వచ్చేసినట్లుంది. నేతలు వచ్చే ఎన్నికలకు అప్పడే సిద్దమవుతున్నారు. మేము రెడీ అంటూ క్యాడర్ కు, జనాలకు సంకేతాలు ఇస్తున్నారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సయితం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి కడప జిల్లా రాజకీయాల్లో హీట్ పుట్టించారు. తనకు ఇంకా రాజకీయాల్లోనే కొనసాగాలని ఉందని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పడంతో మైదుకూరులో మళ్లీ రాజకీయం మొదలయింది.

ఏ పార్టీలో చేరతారన్నది….

ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డీఎల్ రవీంద్రారెడ్డి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ లో ఇన్ యాక్టివ్ అయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో వరసగా ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించి మైదుకూరు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆయన అసలు పోటీకి దిగలేదు. దీంతో పదేళ్లు ఆయన పదవికి దూరమయ్యారు.

టీడీపీలో కూడా….

ఈసారి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీకి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు ఏ పార్టీలోకి చేరతారన్నది చర్చనీయాంశమైంది. ఇక్కడ మరో బలమైన పార్టీ తెలుగుదేశం మాత్రమే. మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఆ పార్టీకి ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఆయన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు బంధువు. పైగా 2014, 2019 ఎన్నికల్లో వరసగా ఓడిపోతుండటంతో సానుభూతి ఉందని, ఈసారి తన గెలుపు ఖాయమని ఆయన లెక్కలు వేస్తున్నారు.

బీజేపీ, జనసేనలే దిక్కు….

పుట్టా సుధాకర్ యాదవ్ ను కాదని చంద్రబాబు మైదుకూరు టిక్కెట్ ను డీఎల్ రవీంద్రారెడ్డికి ఇచ్చే సాహసం చేయరు. దీంతో డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరే అవకాశం లేదు. టిక్కెట్ హామీ వచ్చి పార్టీ ఇన్ ఛార్జిగా నియమిస్తానంటే తప్ప ఆయన టీడీపీలో చేరరు. ఈ అవకాశం యాభై శాతం మాత్రమే. మరోవైపు డీఎల్ రవీంద్రారెడ్డికి మరో ఆప్షన్ బీజేపీ, జనసేన. తన వ్యక్తిగత ఇమేజ్ తో బీజేపీ లేదా జనసేనలో చేరి ఆయన పోటీ చేసే వీలుంది. మొత్తం మీద డీఎల్ రవీంద్రారెడ్డికి బీజేపీ, జనసేనలు తప్ప మరో పార్టీ మైదుకూరులో టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదు.

Tags:    

Similar News