Dl ravindra reddy : ట్రిపుల్ రెడ్డికి టీడీపీ ఆఫర్ ఇదే
డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరులో తిరిగి యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత మైదుకూరు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. తాను ఖచ్చితంగా [more]
డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరులో తిరిగి యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత మైదుకూరు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. తాను ఖచ్చితంగా [more]
డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరులో తిరిగి యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత మైదుకూరు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎల్ రవీంద్రరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన బీజేపీ, జనసేన వంటి పార్టీలను చూడరు.
గౌరవం లభిస్తుందని….
తెలుగుదేశం పార్టీ అయితే తనకు గౌరవం లభిస్తుందని డీఎల్ రవీంద్రారెడ్డి భావిస్తున్నారు. టీడీపీ కూడా డీఎల్ చేరితే కొంత ఊపు వస్తుందని భావిస్తుంది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంతంత మాత్రంగానే ఉంది. ఏ నియోజకవర్గంలోనూ సరైన నేత లేరు. దీంతో డీఎల్ రవీంద్రారెడ్డి వంటి బలమైన నేత పార్టీలో చేరితే జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హైప్ వస్తుందన్నది టీడీపీ నేతల అంచనాగా ఉంది.
డీఎల్ కూడా….
అందుకే డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలో చేర్చుకునేందుకు సిద్దమయ్యారు. ఆయనకు అవసరమైతే మైదుకూరు టిక్కెట్ ను కూడా ఇచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారన్న టాక్ విన్పిస్తుంది. డీఎల్ రవీంద్రారెడ్డికి కూడా వేరే ఆప్షన్ లేదు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతిచ్చినా, టీడీపీ వైపే ఆయన వెళ్లాల్సి ఉంటుంది. శెట్టిపల్లె కుటుంబాన్ని ఓడించడమే డీఎల్ రవీంద్రారెడ్డి ధ్యేయంగా పెట్టుకున్నారు. వైసీపీలో తన అనుచరులకు ఎలాంటి పదవులు దక్కకపోవడమే ఆయన అసంతృప్తికి కారణం.
త్వరలోనే ప్రకటన…..
ఇక టీడీపీలో చేరేందుకు డీఎల్ రవీంద్రారెడ్డి మానసికంగా సిద్దమయినట్లే కన్పిస్తుంది. టీడీపీ నాయకత్వం కూడా పుట్టా సుధాకర్ యాదవ్ కు నచ్చ చెప్పాలని చూస్తుంది. డీఎల్ అయితే రెడ్డి సామాజికవర్గం జగన్ ను కాదని తమవైపు వచ్చిందని రాష్ట్రమంతటా కొంత అడ్వాంటేజీ వస్తుంది. దీంతో చంద్రబాబు డీఎల్ రవీంద్రారెడ్డి ని పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే డీఎల్ రవీంద్రారెడ్డి తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేసే అవకాశముంది.