ఎంతకాలం…? ఎంత దూరం?
మొత్తానికి బీజేపీ నేత యడ్యూరప్ప కల నెరవేరింది. ఆయన కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తర్జన భర్జనల మధ్య యడ్యూరప్పకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఓకే [more]
;
మొత్తానికి బీజేపీ నేత యడ్యూరప్ప కల నెరవేరింది. ఆయన కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తర్జన భర్జనల మధ్య యడ్యూరప్పకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఓకే [more]
మొత్తానికి బీజేపీ నేత యడ్యూరప్ప కల నెరవేరింది. ఆయన కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తర్జన భర్జనల మధ్య యడ్యూరప్పకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఓకే చెప్పడంతో ఆయన ఈరోజే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే యడ్యూరప్ప కు శాసనసభలో తగినంత బలం ఉందా? బలాన్ని నిరూపించుకోవాల్సి వస్తే యడ్యూరప్ప వద్ద ఉన్న మంత్రమేంటన్న చర్చ కన్నడనాట జోరుగా సాగుతుంది.
మ్యాజిక్ ఫిగర్ లేక…..
కర్ణాటక శాసనసభలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేక అధికారానికి దూరమయింది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశాయి. అయితే కాంగ్రెస్ లో అసంతృప్తి, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి కలగలపి ఆ ప్రభుత్వ పతనానికి దారితీశాయి. ఇప్పటికే కర్ణాటక శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్ ముగ్గురు శాసనసభ్యులపై అనర్హత వేటు వేశారు.
చర్యలు తీసుకున్నా…..
ఇప్పుడు ఇంకా అసంతృప్త ఎమ్మెల్యేలు 12 మంది వరకూ ఉన్నారు. వీరిపై స్పీకర్ త్వరలో చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఈనేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ఉప ఎన్నికలలో గెలిస్తేనే యడ్యూరప్ప ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. లేకుంటే కూలిపోక తప్పదు. రెబెల్ ఎమ్మెల్యేల పరిస్థితిపైనే యడ్యూరప్ప భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
మంత్రివర్గ ఏర్పాటుతో….
ఇక యడ్యూరప్ప తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి ఉంటుంది. బీజేపీలో యాభై మంది వరకూ మంత్రి పదవుల కోసం కాచుక్కూర్చుని ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో లాబీయింగ్ కూడా చేశారు. యడ్యూరప్ప మాత్రం 34 మందికి మించి మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితి. మంత్రి పదవులు దక్కకుంటే వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. సోమవారం యడ్యూరప్ప బలాన్ని నిరూపించుకున్న తర్వాతే మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నారు. మరోవైపు కాంగ్రెస్ రివర్స్ ఆపరేషన్ కు దిగడంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు కాని ఎంతకాలం? అన్నదే ప్రశ్న.