ఆమె సీటు కోసం ఈయన రచ్చ మొదలెట్టాడుగా?
ఏపీలో రాజధాని అమరావతికి కేంద్రంగా ఉన్న తాడికొండ నియోజకవర్గ అధికార వైసీపీలో రాజకీయ రగడ మామూలుగా లేదు. కొద్ది రోజులుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి, [more]
;
ఏపీలో రాజధాని అమరావతికి కేంద్రంగా ఉన్న తాడికొండ నియోజకవర్గ అధికార వైసీపీలో రాజకీయ రగడ మామూలుగా లేదు. కొద్ది రోజులుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి, [more]
ఏపీలో రాజధాని అమరావతికి కేంద్రంగా ఉన్న తాడికొండ నియోజకవర్గ అధికార వైసీపీలో రాజకీయ రగడ మామూలుగా లేదు. కొద్ది రోజులుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ( ఆయనది కూడా తాడికొండ నియోజకవర్గమే) మధ్య గ్రూపు రాజకీయం నడిచింది. బాపట్లకు తాడికొండకు సంబంధం లేకపోయినా తాడికొండలో సురేష్ ఓ గ్రూపు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండలో పాగా వేసేందుకే నందిగం ఎమ్మెల్యే శ్రీదేవికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. అధిష్టానం వద్ద ఇద్దరు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. చివరకు అధిష్టానం వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడంతో వీరి వార్‌కు తెరపడింది.
మూడో పవర్ సెంటర్…
ఈ రెండు పవర్ సెంటర్లతోనే తాడికొండ వైసీపీ సతమతమవుతుంటే ఇప్పుడు అక్కడ మూడో పవర్ సెంటర్ వచ్చేసింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి తాడికొండలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి కూడా అయ్యారు. డొక్కాకు ఈ నియోజకవర్గంలో బలమైన వర్గం ఉంది. పాత కాంగ్రెస్ నేతలతో పాటు, కమ్మ సామాజిక వర్గంలోనూ డొక్కాను అభిమానించే వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు ఆ వర్గాన్ని ఏకం చేయడంతో పాటు స్థానికంగా ఎమ్మెల్యే శ్రీదేవిపై గుర్రుగా ఉన్న వర్గాన్ని డొక్కా ఏకతాటిమీదకు తెస్తున్నారు.
కుమార్తె కోసమేనా?
ఇటీవల ఎమ్మెల్యే శ్రీదేవికి వివాదాస్పద ఆడియోలు వరుసగా బయటకు వస్తున్నాయి. ఎంపీ సురేష్‌తో ఆమె గొడవలు సద్దుమణిగాయని.. వారి మధ్య రాజీ కూడా కుదరిందని.. అయినా శ్రీదేవి ఎందుకు టార్గెట్ అవుతున్నారన్న విషయం ఆరా తీయగా… వీటి వెనక డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారన్న ప్రచారమే ఎక్కువుగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరపున తన కుమార్తెను పోటీ చేయించాలని డొక్కా ఇప్పటి నుంచే వ్యూహాలతో ఉన్నారట. ఈ క్రమంలోనే శ్రీదేవిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నారన్న ప్రచారం అయితే గుంటూరు జిల్లా రాజకీయాల్లో బయటకు వస్తోంది.
తాతయ్యా అంటూ …?
నిన్న మొన్నటి వరకు ఎంపీ సురేష్ వర్గంతో వార్‌తో విసిగిపోయిన శ్రీదేవికి ఇప్పుడు ఆ తలనొప్పి పోయిందనుకుంటే ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ రూపంలో మరో తలనొప్పి రావడంతో శ్రీదేవి & టీం ఎదురు దాడికి దిగుతోంది. శ్రీదేవి వర్గం వాళ్లు కూడా సోషల్ మీడియాలో డొక్కాను టార్గెట్ చేస్తున్నారు. పార్టీ మారి వచ్చిన తాతయ్యా అంటూ పరోక్షంగా పోస్టులు పెడుతూ కౌంటర్లు ఇవ్వడంతో పాటు గతంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఈ తాతయ్య చాలా డేంజర్, నమ్మొద్దంటూ కౌంటర్ ప్రచారం చేస్తున్నారు. నీ వాయిస్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయ్ తాతయ్యా ? త‌్వరలోనే వాటిని బయట పెడతాం అంటూ సోషల్ మీడియాలోనే టార్గెట్ చేస్తున్నారు. ఏదేమైనా తాడికొండ వైసీపీలో మూడో పవర్ సెంటర్ కూడా స్ట్రాంగ్ అవ్వడంతో ఈ వార్ ఎటు మలుపులు తిరుగుతుందో ? చూడాలి.