ద్రోణంరాజుకు అదే చివరి ఛాన్స్ అట

ఆయన ఉత్తరాంధ్ర టైగర్ గా ముద్ర పడ్డారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. గ్రామ కరణంగా జీవితం మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యునిగా ఢిల్లీ వరకూ ఎదిగారు. [more]

;

Update: 2020-04-03 14:30 GMT

ఆయన ఉత్తరాంధ్ర టైగర్ గా ముద్ర పడ్డారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. గ్రామ కరణంగా జీవితం మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యునిగా ఢిల్లీ వరకూ ఎదిగారు. ఆయనే ద్రోణంరాజు సత్యనారాయణ. అన్ని పార్టీలతో కూడా అజాత శత్రువుగా మెలిగిన ఆయన తాను ఉన్నపుడే రాజకీయ వారసుడిని తయారుచేసుకున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రికి తగిన తనయుడుగా పేరు గడించారు. అయితే తండ్రి చాణక్య నీతి, రాజకీయ వ్యూహాలు మాత్రం పెద్దగా పట్టుపడలేదు. అయినా సరే ఓ విధంగా రాజకీయ అదృష్టవంతుడిగానే చెప్పుకోవాలి.

విలువైన బంధం…..

నిజానికి ద్రోణం రాజు కుటుంబానికి వైఎస్సార్ కుటుంబానికి రాజకీయాలకు అతీతమైన సంబంధం ఉంది. వైఎస్సార్ లో ముఖ్యమంత్రిని ఏనాడో చూసిన ద్రోణంరాజు ఆ దిశగా ప్రోత్సహించారు. అనుకున్నట్లుగా వైఎస్సార్ సీఎం అయ్యారు. ఆయన దగ్గర మంత్రిగా పనిచేయాలనుకున్న ద్రోణం రాజు ఆశ తీరకుండానే కన్ను మూశారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో ద్రోణంరాజు శ్రీనివాస్ గెలిచారు. దాని వెనక వైఎస్సార్ అండ పూర్తిగా ఉంది. 2009 ఎన్నికల్లో కూడా ఎంతో మంది టిక్కెట్ కోరుతూ పోటీకి దిగినా టికెట్ ద్రోణంరాజు శ్రీనివాస్ కే ఇచ్చి గెలిపించుకున్నారు వైఎస్సార్.

ఓడినా పదవి…

ఇక 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ చితికిపోయినా శ్రీనివాస్ పార్టీకే కట్టుబడి పోటీ చేశారు. 2019 నాటికి ఆయన అనూహ్యంగా వైసీపీలో చేరిపోయారు. ఆయన రావాలని బలంగా కోరుకున్న జగన్ పార్టీలోకి వచ్చీ రావడంతో టికెట్ ఇచ్చారు. స్వల్ప ఓట్ల తేడాతో శ్రీనివాస్ ఓడిపోయారు. అక్కడితో ఆయన రాజకీయ జీవితం సరి అనుకుంటే జగన్ నేరుగా ఆయన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా చేశారు. క్యాబినెట్ ర్యాంక్ హోదాతో ఈ పదవిని ద్రోణంరాజుశ్రీనివాస్ కి కట్టబెట్టి వైఎస్సార్ కుటుంబం అంటే ఏంటో చాటి చెప్పారు.

పోటీ ఎక్కువే….?

ఇదిలా ఉండగా మూడేళ్ళ కాలపరిమితి కలిగిన ఈ పదవిని జాగ్రత్తగా ద్రోణంరాజు శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. నిజాయతీగా ఉండడం, అవినీతి లేకపోవడం వల్లనే ఆయన్ని ఈ పదవికి ఎంపిక చేసుకున్నారని అంటారు. ఇక ఈ పదవి తరువాత ద్రోణంరాజు శ్రీనివాస్ కోరుకున్నట్లుగా ఎమ్మెల్సీ చేస్తారనుకుంటే శాసనమండలి రద్దు అయ్యేలా ఉంది. దాంతో ద్రోణంరాజుశ్రీనివాస్ కి ఇదే చివరి పదవా అని ఆయన అభిమానులలో చర్చగా ఉంది. దానికి కారణం ఉంది. విశాఖ సౌత్ లో ముస్లిం మైనారిటీ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈసారి వారికి అవకాశం ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. దానికి నాందిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రహమాన్ వైసీపీలో చేరడంగా చెబుతున్నారు. చంద్రబాబు పలుమార్లు టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసిన తరువాత రహమాన్ వైసీపీ గూటికి చేరారు. దాంతో ఆయనకు జగన్ హామీ మేరకు ఈసారి వైసీపీ టికెట్ ఖాయమని అంటున్నారు. అదే జరిగితే ద్రోణంరాజు శ్రీనివాస్ భవితవ్యం ఏంటన్నది అపుడు చూడాలి.

Tags:    

Similar News