వైసీపీలో మ‌ళ్లీ ప‌ద‌వులు… ఆరుగురు కొత్త ఎమ్మెల్సీలు ఎవ‌రు ?

ఏపీలో గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల నోటిఫికెషన్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. ఆ వెంట‌నే మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు [more]

Update: 2021-02-19 06:30 GMT

ఏపీలో గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల నోటిఫికెషన్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. ఆ వెంట‌నే మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆ వెంట‌నే తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక రానుంది. ఆ వెంట‌నే ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల‌కు కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల సంద‌ట్లోనే మ‌రో ఎన్నిక‌ల‌తో ఏపీ రాజ‌కీయం మ‌రింత హీటెక్కనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. టీడీపీకి చెందిన గుమ్మడి సంధ్యారాణి, గుండుమ‌ల తిప్పేస్వామి, వట్టికూటి వీరవెంకన్న చౌదరి, షేక్ మహ్మద్ ఇక్బాల్ పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.

వైసీపీకే ఖాయమవ్వడంతో….

ఇక మంత్రిగా ఉండి రాజ్యస‌భకు వెళ్లిన పిల్లి బోస్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ స్థానంతో పాటు.. ఇటీవ‌ల మృతి చెందిన చ‌ల్లా రామ‌కృష్ణా రెడ్డి స్థానం కూడా ఖాళీ అయ్యింది. మొత్తంగా ఆరు శాస‌న‌స‌భ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఆరు స్థానాల‌కు కూడా ఎన్నిక‌లు మార్చి 15న జ‌ర‌గ‌నుంది. అదే రోజు కౌంటింగ్ చేస్తారు. ఈ ఆరు స్థానాలు కూడా అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. వైసీపీకి శాస‌న‌స‌భ‌లో ఏకంగా 151 మంది స‌భ్యులు ఉన్నారు. దీనికి తోడు జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ కూడా వైసీపీకే ఓటేయ‌నున్నారు. ఆరు స్థానాలు వైసీపీ ఖాతాలోనే ప‌డుతుండ‌డంతో ఇవి అధికార పార్టీలో ఎవ‌రికి ద‌క్కుతాయ‌న్నది మాత్రం స‌స్పెన్స్‌గానే ఉంది.

ఆయనకు గ్యారంటీ అట….

వైసీపీలో జ‌గ‌న్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన వారితో పాటు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త్యాగాలు చేసిన నేత‌ల లిస్ట్ చాలానే ఉంది. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ క‌రుణించే ఆ ఆరుగురు నేత‌లు ఎవ‌రా ? అన్నదానిపై వైసీపీలోనే ఉత్కంఠ నెల‌కొంది. అంద‌రిక‌న్నా ముందుగా గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పేరు వినిపిస్తోంది. ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీ + మంత్రి ప‌ద‌విపై హామీ ఇచ్చారు. పైగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్క క‌మ్మ నేత‌కు కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదు.. ఆ మాట‌కు వస్తే వైసీపీ పుట్టాకే క‌మ్మ ఎమ్మెల్సీ లేరు. రాజ‌శేఖ‌ర్‌కు మంత్రి హామీ కూడా ఇచ్చి ఉండ‌డంతో త్వర‌లో జ‌రిగే ప్రక్షాళ‌న‌లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఉంటే ఇప్పుడు ఖ‌చ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే.

విన్పిస్తున్న పేర్లు ఇవే…..

ఇక అదే జిల్లా నుంచి జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్ లేళ్ల అప్పిరెడ్డి పేరు కూడా ప్రథ‌మంగా వినిపిస్తోంది. ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎప్పుడో హామీ ఇచ్చేశారంటున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి భ‌ర‌త్‌, బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి పేర్లు లైన్లో ఉన్నా… భ‌ర‌త్‌కే ఎమ్మెల్సీ హామీ ఉంది. ఇక చ‌ల్లా స్థానాన్ని సీమ‌కే చెందిన రెడ్డి వ‌ర్గం నేత‌ల‌తో భ‌ర్తీ చేస్తార‌ని అంటున్నారు. ఈ సీటు కోసం ఆయ‌న భార్య కు కాని కుమారుడి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. హిందూపురం పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఇక్బాల్‌కు త‌న సీటు మైనార్టీ కోటాలో రెన్యువ‌ల్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక గోదావ‌రి జిల్లాల నుంచి ఓ కాపు నేత‌కు ఎమ్మెల్సీ ఇచ్చే యోచ‌న‌లో అధిష్టానం ఉంది. ఆకుల వీర్రాజుతో పాటు మ‌రో ఒక‌రిద్దరు నేతల పేర్లు ఈ కోటాలో పరిశీల‌న‌కు రావొచ్చు.

లెక్క కు మించి ఆశావహులు…..

కాపు కోటాలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహ‌న్‌కు ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. ఆయ‌న్ను ప‌రుచూరు పంపే కండీష‌న్ వెన‌క ఎమ్మెల్సీ హామీ ఉందంటున్నారు. ఇక బల్లి కుమారుడికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా తిరుప‌తి పార్లమెంటు ఎన్నిక‌ల‌కు వెళితే ఇబ్బంది వ‌స్తుంద‌న్న భావ‌న‌లో కూడా అధిష్టానం ఉంది. మ‌రి లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ వైసీపీ అశావాహుల్లో ఎవ‌రికి ఎమ్మెల్సీ అదృష్టం వ‌రిస్తుందో ? చూడాలి.

Tags:    

Similar News