మాజీ మంత్రి బాబుకు హ్యాండిస్తున్నారా..? టీడీపీలో ఏం జ‌రుగుతోంది?

మాజీ మంత్రి ఒకరు టీడీపీకి బై చెప్పనున్నారా ? బాబబై.. బై.. అన‌నున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నా యి టీడీపీ వ‌ర్గాలు. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు.. [more]

;

Update: 2020-06-03 02:00 GMT

మాజీ మంత్రి ఒకరు టీడీపీకి బై చెప్పనున్నారా ? బాబబై.. బై.. అన‌నున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నా యి టీడీపీ వ‌ర్గాలు. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు.. చిత్తూరు జిల్లాకు చెందిన ప‌ల‌మ‌నేరు మాజీ ఎమ్మె మంత్రి అమ‌ర్నాథ‌రెడ్డి త్వర‌లోనే టీడీపీ సైకిల్ దిగిపోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అయితే, ఆయ‌న‌కు బీజేపీ నుంచి బ‌ల‌మైన నేత‌ల ఆహ్వానం కూడా ఉంద‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. టీడీపీలో ఉండే ఆయ‌న ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి విజ‌యం సాధించారు. అయితే, మ‌ధ్యలో చంద్రబాబు పిలుపుతో ఆయ‌న సైకిల్ ఎక్కారు.

వైసీపీ టార్గెట్ చేస్తుండటంతో…..

2017లో జ‌రిగిన చంద్రబాబు మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రిగా ఆయ‌న చ‌క్రం తిప్పారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కొత్త నేత వెంక‌టేష్ గౌడ‌పై చిత్తుగా ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి ఆయ‌న అంత‌ర్మథ‌నంలో ప‌డిపోయారు. జిల్లా మొత్తంగా వైసీపీ దూకుడు ఉండడం, మంత్రి ఒక‌రు జిల్లాలో చ‌క్రం తిప్పుతుండ‌డంతో అమ‌ర్‌నాథ్ ఊసు ఎక్కడా వినిపించ‌డం లేదు. ప‌ల‌మ‌నేరులో అమ‌ర్నాథ్ రెడ్డిని టార్గెట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా… ఆయ‌న ఇక రాజ‌కీయంగా కోలుకోకుండా ఉండేలా వైసీపీ చ‌క్రం తిప్పుతోంది.

ఆర్థిక ఇబ్బందులట….

పోనీ.. టీడీపీ పుంజుకునే రేంజ్‌లో ఉందా? అంటే అది కూడా లేదు. ఇక‌, ఇప్పుడు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు నుంచి ఎలాంటి సాయం కూడా అంద‌డం లేదు. ఈ నేప‌థ్యంలో టీడీపీలో ఉండ‌డం వ‌ల్ల ప్రయోజ‌నం లేద‌ని గ్రహించిన ఆయ‌న వైసీపీ వైపు చూశారు. ఆరు మాసాలుగా ఆయ‌న వైసీపీలోకి జంప్ చేయాల‌ని ప్రయ‌త్నిస్తున్నార‌నే క‌థ‌నాలు వినిపించాయి. అయితే, స్తానికంగా బ‌లంగా ఉన్న మంత్రి ఒక‌రు ఆయ‌న‌కు అడ్డుక‌ట్టవేస్తూ వ‌చ్చారు.

చర్చల దశలో…..

అయితే, రెండున్నరేళ్ల త‌ర్వాత కూడా త‌న మంత్రి ప‌దవి ప‌దిలంగా ఉండాలంటే.. ఖ‌చ్చితంగా జిల్లాలో ప‌ట్టు పెంచుకునేందుకు ప్రయ‌త్నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ్రహించిన స‌ద‌రు మంత్రి వ‌ర్యులు .. ఇప్పుడు అమ‌ర్ నాథ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని అంటున్నారు. అయితే అక్కడ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అమ‌ర్నాథ్ రెడ్డిని ఓడించేందుకు స‌ద‌రు మంత్రే ఇప్పుడు ఎమ్మెల్యే వెంక‌టేష్ గౌడ‌ను బాగా ప్రోత్సహించారు. ఇప్పుడు అమ‌ర్నాథ్‌ను మళ్లీ ఆ మంత్రే పార్టీలోకి తీసుకు వ‌స్తున్నార‌న్న వార్తలు వెంక‌టేష్ వ‌ర్గంలో అల‌జ‌డి రేపుతున్నాయి. ప్రస్తుతం చ‌ర్చల ద‌శ‌లో ఉన్న ఈ ప్రతిపాద‌న మ‌రో నెల రోజుల్లోనే కార్యాచ‌ర‌ణ‌కు వ‌స్తుంద‌ని .. మాజీ మంత్రి పార్టీ మార్పు ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News