పార్టీ మారినా పలకరించే దిక్కులేదట
రాజకీయ నాయకుల జాతకాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. కేవలం రెండు సంవత్సరాల మంత్రి పదవి కోసం పార్టీ మారిన అనంతపురం జిల్లా కదరి అప్పటి [more]
రాజకీయ నాయకుల జాతకాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. కేవలం రెండు సంవత్సరాల మంత్రి పదవి కోసం పార్టీ మారిన అనంతపురం జిల్లా కదరి అప్పటి [more]
రాజకీయ నాయకుల జాతకాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. కేవలం రెండు సంవత్సరాల మంత్రి పదవి కోసం పార్టీ మారిన అనంతపురం జిల్లా కదరి అప్పటి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు, మైనార్టీ నేత అత్తర్ చాంద్ బాషా ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కానరాక తీవ్రంగా మదనపడుతున్నారట. తాను ఏ ఉద్దేశంతో అయితే పార్టీ మారారో.. ఆ ఉద్దేశం నెరవేరకపోగా.. రాజకీయంగా ఇప్పుడు ఆయన సంధికాలాన్ని ఎదుర్కొం టున్నారు. వైసీపీ అధినేత జగన్ ఎంతో ఇష్టంగా 2014లో అత్తర్ చాంద్‌బాషాకు ఇక్కడ కదిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
పులివెందులకు సరిహద్దు ప్రాంతంలో….
ఆయన గెలిచేందుకు అందరినీ ఒకే తాటిపై నడిపించారు. పులివెందులకు సరిహద్దు నియోజకవర్గమైన కదిలో వైసీపీ జెండా ఎగిరేందుకు జగన్ అన్ని తానై వ్యవహరించడంతో పాటు చాంద్ బాషాకు ఆర్థిక సాయం కూడా చేసి మరీ గెలిపించారన్న టాక్ ఉంది. నిజానికి అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్.. తనదైన వ్యూహంతో ఇక్కడ మళ్లీ గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే, ఆయన వ్యూహాలను చిత్తు చేసేలా జగన్ ప్రచారం చేసి.. అత్తర్ చాంద్ బాషాను తొలి ప్రయత్నంలోనే గెలిపించుకున్నారు.
ప్రలోభాలకు లోనై…..
అయితే, అధికారంలోకి వస్తుందని అనుకున్న వైసీపీ 2014లో ప్రతిపక్షానికి పరిమితమైంది. అయినప్పటికీ.. రెండేళ్ల పాటు పార్టీలోనే కొనసాగిన బాషా. . తర్వాత టీడీపీ ప్రలోభాలకు లోనై.. తనకు టికెట్ ఇచ్చిన జగన్‌కు హ్యాండిచ్చారు. ఈ క్రమంలోనే 2017 చివరలో ఆయన పార్టీ మారి చంద్రబాబుకు జై కొట్టారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుచుకున్న సీట్లలో మైనార్టీ ఎమ్మెల్యే లేక పోవడం, దీంతో మైనార్టీ మంత్రి త్వశాఖను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఈ శాఖకు మంత్రిని చేస్తామంటూ.. బాషాకు ఆశ చూపించారు.
ఊహించని విధంగా….
అప్పటికే స్థానిక మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కందికుంటతో తీవ్రంగా విభేదిస్తున్నప్పటికీ.. బాషాకు చంద్రబాబు గేలం వేసి మరీ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో తనకు పదవి వస్తుందనే ఆశతో ఆయన పార్టీ మారిపోయారు. నిజానికి జగన్‌కు అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్న బాషా.. ఇలా పార్టీ మారిపోతార ని ఎవరూ ఊహించలేదు. కానీ, పరిణామ క్రమంలో ఆయనకు చంద్రబాబు ఎలాంటి పదవినీ ఇవ్వలేక పోయారు. 2019 ఎన్నికలకు నాలుగు మాసాల ముందు నామినేటెడ్ పదవిని కట్టబెట్టి చేతులు దులుపుకొన్నారు.
టిక్కెట్ కూడా దక్కక పోవడంతో….
అంతేకాదు, కదిరి టికెట్‌ను కూడా బాషాకు కాకుండా తన పార్టీ నేత కందికుంటకే కేటాయించారు. ఇక, ఇదేసమయంలో ఇద్దరూ కలిసి నడుచుకోవాలని సూచించారు. దీంతో అప్పటికే రెండికీ చెడ్డ రేవడిలా బాషా పరిస్థితి మారిపోయింది. ఇక, ఎన్నికల్లో టీడీపీ ఘోరంగాఓడిపోవడం, కదిరిలో మరోసారి వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడం, తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని తను వదిలించుకోవడం, నమ్మి పార్టీ మారిన టీడీపీ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు బాషా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పైగా కంది కుంట నుంచి నిత్యం ఆయన అవమానాలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఏ ఒక్కరూ పలకరించే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో వైసీపీలోకి తిరిగి చేరిపోవాలని, జగన్‌కు జైకొట్టాలని ఆయన భావిస్తున్నారు. అయితే, స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జగన్‌ను కలిసేందుకు కానీ, ఆయనకు తన మనసులో మాట చెప్పుకొనేందుకు కానీ అవకాశం లేక పోవడంతో చాంద్ బాషాలో కలవరంపెరిగి పోతుండడం గమనార్హం. దీనిని పరిశీలిస్తున్న స్థానికులు చేసుకున్న వారికి చేసుకున్నంత! అని ఈసడిస్తుండడం గమనార్హం.