నాడు శాసించిన వారు.. నేడు అర్థిస్తున్నారా?
యూపీఏ కష్టాల్లో ఉంది. వచ్చే ఎన్నికలకు సమాయత్తమవ్వడానికి ఒక్క కాంగ్రెస్ పార్టీకే శక్తి సరిపోదన్నది వాస్తవం. కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. ప్రాంతీయ పార్టీలు [more]
యూపీఏ కష్టాల్లో ఉంది. వచ్చే ఎన్నికలకు సమాయత్తమవ్వడానికి ఒక్క కాంగ్రెస్ పార్టీకే శక్తి సరిపోదన్నది వాస్తవం. కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. ప్రాంతీయ పార్టీలు [more]
యూపీఏ కష్టాల్లో ఉంది. వచ్చే ఎన్నికలకు సమాయత్తమవ్వడానికి ఒక్క కాంగ్రెస్ పార్టీకే శక్తి సరిపోదన్నది వాస్తవం. కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. ప్రాంతీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో ఆధిక్యతను కనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఏ అనేది వచ్చే ఎన్నికల్లో ఉంటుందా? లేదా? అన్నది పార్టీలోనే చర్చగా మారింది. ఇంతకు ముందు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైపు చూసేవి. ఇప్పుడు అదే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ఎదురు చూపులు చూస్తుంది.
యూపీఏ ఛైర్ పర్సన్ గా…..
యూపీఏ 1, యూపీఏ 2 దేశంలో అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. సోనియా గాంధీ యూపీఏ ఛైర్ పర్సన్ గా కొనసాగారు. అధికారంలో ఉండటంతో అన్ని పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు పలికాయి. కాంగ్రెస్ వెన్నంటే నిలిచాయి. పదేళ్ల పాటు అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ శాసించింది. అయితే అదే చేతులు ఇప్పుడు అర్ధించే స్థితికి చేరుకున్నాయి.
రాహుల్ ను పార్టీ అధ్యక్షుడిని చేసినా….
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ అధ్యక్షుడు ఎవరనే తేల్చుకునే పనిలోనే ఉంది. చివరకు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేస్తారు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఇప్పుడు అన్ని పార్టీలనూ కలుపుకుని నడిపించగల యూపీఏ ఛైర్మన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ యూపీఏ ఛైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ ఆరోగ్య కారణాలతో ఆ పదవిని చేపట్టలేరు. సోనియా ఆ పదవిలో ఉంటే కొంత ప్రాంతీయ పార్టీల్లోనూ సానుకూలత ఉండే అవకాశం ఉంది.
యూపీఏ ఛైర్మన్ కీలకం….
కానీ రాహుల్ గాంధీ యూపీఏ ఛైర్మన్ అయితే మాత్రం ప్రాంతీయ పార్టీలు ఎక్కిదిగుతాయంటారు. ఆయన వయసు, రాజకీయ అనుభవమే ఇందుకు కారణం. దీంతో శరద్ పవార్ ను యూపీఏ ఛైర్మన్ ను చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి శరద్ పవార్ సుముఖంగా లేరు. లేకుంటే కాంగ్రెస్ లోనే సీనియర్ నేతకు యూపీఏ ఛైర్మన్ గా నియమించాల్సి ఉంటుంది. దీనివల్ల ఎంత వరకూ ప్రయోజనం ఉంటుందన్నది ప్రశ్నగానే ఉంటుంది. మొత్తం మీద శాసించిన చేతులు ఇకపై అర్ధించాల్సిన పరిస్థితిలో మాత్రం కాంగ్రెస్ లో స్పష్టంగా కనపడుతుంది.