ఆయనకు గ్యారంటీగా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనా ?
వైసీపీలో పదవుల పోరు మామూలుగా లేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆశపడి చాలా మంది చేరారు. వారంతా చకోర పక్షుల్లా ఇప్పటికీ అలా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే [more]
;
వైసీపీలో పదవుల పోరు మామూలుగా లేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆశపడి చాలా మంది చేరారు. వారంతా చకోర పక్షుల్లా ఇప్పటికీ అలా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే [more]
వైసీపీలో పదవుల పోరు మామూలుగా లేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆశపడి చాలా మంది చేరారు. వారంతా చకోర పక్షుల్లా ఇప్పటికీ అలా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ మోస్ట్ లీడర్ గా తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన డాక్టర్ ఎస్ ఎ రహమాన్ జగన్ మూడు రాజధానులకు మద్దతుగా ఈ ఏడాది మొదట్లో వైసీపీలో చేరారు. ఆయన టీడీపీలో ఒకసారి ఎమ్మెల్యేగా, వుడా చైర్మన్ గా పనిచేశారు. అంతే కాదు పార్టీ విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ గా పలుమార్లు నాయకత్వం వహించారు. ఇపుడు వైసీపీలో ఆయన సాధారణ నాయకుడిగా మిగిలిపోవడం పట్ల అనుచరులు మదనపడుతున్నారు.
చట్ట సభలోకి అలా….
ఇక రహమాన్ కి ఏదో విధంగా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఉంది. ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం విశ్వప్రయత్నం చేసి అది దక్కకపోవడంతోనే అసంతృప్తి పెంచుకున్నారు. అయితే ఆయన వైసీపీలో చేరడం వెనక కూడా 2024 ఎన్నికల్లో విశాఖ సౌత్ ఎమ్మెల్యే టికెట్ ఆశ చాలా ఉంది. అయితే కొద్ది నెలల క్రితం సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ కూడా వైసీపీకి జై కొట్టడంతో రహమాన్ వర్గీయుల్లో ఆందోళన ఒక్కసారిగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కూడా వాసుపల్లి కారణంగా టికెట్ దక్కకపోతే తమ సంగతేంటన్న బాధ రహమాన్ లోనూ ఉందని అంటున్నారు.
ఆ కోటా కోసం…
దీంతో రహమాన్ చూపు ఇపుడు శాసనమండలి మీద పడింది అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి మైనారిటీ కోటలో ముస్లిం నేతగా ఆయన ఉన్నారు. పైగా రాజకీయంగా పలుకుబడి కలిగిన తనకు జగన్ కచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి న్యాయం చేస్తారని భావిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ పదవి కూడా టీడీపీ ఉన్నప్పటి నుంచి రహమాన్ ట్రై చేస్తూనే వచ్చారు. అక్కడ చంద్రబాబు దెబ్బ కొట్టారు, ఇపుడు వైసీపీలో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎలాగోలా ఎమ్మెల్సీ అయ్యేందుకు గట్టిగానే పట్టుబట్టాలని రహమాన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఆయన విజయసాయిరెడ్డి ద్వారా జగన్ కి ఎప్పటికపుడు విన్నపాలు చేసుకుంటూ వస్తున్నారు.
ఇదే సమయమా…?
ఇక వైసీపీకి విశాఖ మేయర్ సీటు అవసరం. వచ్చే ఏడాది మేలో ఎటూ ఆ ఎన్నికలు తప్పకుండా జరిగేట్టున్నాయి. దానికి ముందు పార్టీలో పెద్ద తలకాయలను దగ్గరకు తీయాలని కూడా వైసీపీ ఆలోచిస్తోంది. దాంతో మైనారిటీ కోటాలో రహమాన్ కి ప్రాధాన్యత ఉంటుందని మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. అదే విధంగా విశాఖ సిటీలోని మైనారిటీలో గట్టి పట్టున్న రహమాన్ కి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఆయా వర్గం ఓట్లను గుత్తమొత్తంగా జీవీఎంసీ ఎన్నికల్లో తమకే పడేలా చేసుకోవాలని వైసీపీ యోచిస్తోందని అంటున్నారు. రోగి కోరింది డాక్టర్ ఇచ్చేది ఒక్కటే అన్న సామెత రహమాన్ విషయంలో కనుక నిజమైతే మాత్రం కొత్త ఏడాది ఆయన ఎమ్మెల్సీ అయి తీరుతారని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.