వైసీపీకి పట్టున్న ప్రాంతమని…?

ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువ. ఇక్కడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకూ, అలాగే ఒడిషా వైపు భౌగోళికంగా విస్తరించిఉంది ఉత్తరాంధ్రాలో ఏజెన్సీ ప్రాంతాలు వైసీపీకి [more]

Update: 2019-08-04 06:30 GMT

ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువ. ఇక్కడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకూ, అలాగే ఒడిషా వైపు భౌగోళికంగా విస్తరించిఉంది ఉత్తరాంధ్రాలో ఏజెన్సీ ప్రాంతాలు వైసీపీకి పట్టు కొమ్మలుగా ఉన్నాయి. ఇప్పటికి రెండు ఎన్నికల్లో వైసీపీ పాల్గొంటే మంచి మెజారిటీతో గెలిపించిన చరిత్ర ఉంది. ఇదిలా ఉండంగా ఏజెన్సీ అభివృధ్ధి కోసం జగన్ సర్కార్ అనేక పనులను చేపడుతోంది. అధికారంలోకి వస్తూనే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిన వైసీపీ సర్కార్ గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేసింది. గిరిజనులకు బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది ఈ నేపధ్యంలోనే ఏజెన్సీ ప్రజలకు తిరుమల వెంకన్నను కూడా అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. స్వామి వారి దివ్యమైన ఆలయాన్ని ఏజెన్సీలో నిర్మించడం ద్వారా టెంపుల్ టూరిజానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం టీటీడీ ద్వారా సమగ్ర ప్రణాళికను అమలుచేయిస్తోంది.

మారుమూల ప్రాంతంలో….

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం పద్మాపురం ప్రాంతంలో దట్టమైన అడవుల మధ్యన టీటీడీ అధ్బుతమైన దేవాలయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదిస్తోంది. ఇక్కడ స్వామి వారి కోవెలతో పాటు, టీటీడీ సత్రాలను కూడా నిర్మించాలనుకుంటున్నారు. దీంతో ఒడిషా, ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రజలకే కాకుండా మూడు జిల్లాల ప్రజ‌లకు కూడా తిరుపతి వెంకన్న దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ స్వామిని చూసేందుకు తిరుమల వెళ్ళి రావడం వ్యయ ప్రయాసలతొ కూడుకున్న వ్యవహారం. అదే టీటీడీ ఆలయం ఇక్కడే నిర్మిస్తే ఇక ప్రతీ రోజూ స్వామి కన్నుల ముందే ఉంటారు. పైగా గిరిజనుల సన్నిధికి స్వామిని తేవడం ద్వారా వారి ప్రాంతాలను కూడా అభివ్రుధ్ధి చేసేందుకు వీలు అవుతుందని అంటున్నారు.

పెద్ద ఎత్తున ఉపాధి….

టెంపుల్ టూరిజాన్ని అభివ్రుధ్ధి చేస్తామని విశాఖ జిల్లాకు చెందిన పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావు చెబుతున్నారు. అందుకోసం పురాతన దేవాలయాలకు కొత్త రూపు తేవడం, కొత్తగా ఆలయాలు నిర్మాణం చేయడం వంటివి ప్రణాళికలో పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ నేపధ్యంలో టీటీడీ వెంకన్న ఆలయాన్ని కనుక నిర్మించినట్లైతే ఉత్తరాంధ్ర మరో తిరుమల అవుతుందనడంలో సందేహం లేదు. నిత్యం భక్తుల రాకపోకలతో పద్మాపురంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని స్థానిక గిరిజనులు అంటున్నారు. దీని మీద సర్వే చేశారని, తోందరలోనే పనులను మొదలుపెడతారని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలియచేశారు. మొత్తానికి ఇక గిరి సీమల్లో వెంకన్న కీర్తనలొ తొందరలో వినిపించి భక్తుల మదిని పులకరింపచేస్తాయి.

Tags:    

Similar News