వారందరికీ జగన్ ఉత్త చేతులే చూపుతారా?
ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కార్పొరేషన్లు.. అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన 56 కులాల [more]
;
ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కార్పొరేషన్లు.. అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన 56 కులాల [more]
ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కార్పొరేషన్లు.. అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన 56 కులాల వారికి ప్రత్యేకంగా కార్పొ రేషన్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేకూరుతుందని.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమంతోపాటు.. కార్పొరేషన్ల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుందని.. సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయా కార్పొరేషన్లలో మహిళలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
60 శాతం మందికి…
దాదాపు 60 శాతం మంది మహిళలకు చైర్మన్లుగా అవకాశం కల్పించారు. రాజకీయంగా ఈ విధానం వైసీపీకి కలిసి వచ్చింది. ఎంతో మంది పార్టీ కోసం కొన్ని సంవత్సరాలుగా కష్టపడ్డామని.. మాకు గుర్తింపు లేదని భావించిన వారికి ఈ కార్పొరేషన్ల ద్వారా చైర్మన్ సహా సభ్యత్వ పదువులు దక్కాయి. అయితే.. ఇప్పుడు అసలు చిక్కు వచ్చి పడింది. ఈ కార్పొరేషన్లు ఏం చేయాలన్నా కూడా నిధులు కేటాయించాలి. కనీసం ఒక్కొక్క కార్పొరేషన్‌కు కోటి రూపాయల చొప్పున అయినా.. నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. విధులు ముందుకు సాగే ఛాన్స్ కనిపించడం లేదు.
ఆర్థిక పరిస్థితి దృష్ట్యా…..?
పోనీ.. చిన్న కార్పొరేషన్లకు నిధులు తగ్గించినా.. మిగిలిన పెద్ద కార్పొరేషన్లను నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితిలో నిధుల కేటాయింపు చాలా కష్టంగా మారిందని స్వయంగా మంత్రులే చెబుతున్నారు. అలాగని సరిపుచ్చుకుంటే.. ప్రతిపక్షాల నుంచి ఇప్పటికే ఎదురు దాడి ప్రారంభమైంది. నిదులు లేని కార్పొరేషన్లు.. ఎందుకు? అనే ప్రశ్న వస్తోంది. అదే సమయంలో కార్పొరేషన్ల విధులను కూడా ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. ఈ విషయంలోనూ సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. అంటే.. ఒకవైపు నిధులు అందిస్తూనే.. మరోవైపు విధులను కూడా నిర్దేశించాలి. లేకపోతే.. ఇంత చేసినా.. కార్పొరేషన్‌లు వృథా అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
బాబు కూడా ప్రయత్నించి….
ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి పెట్టినా.. కార్పొరేషన్లకు నిధుల విషయంలో మాత్రం సర్కారుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అనే మాటే వినిపిస్తోంది. వాస్తవానికి గతంలోనూ చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారు. ఏకంగా 62 సామాజిక వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని భావించారు.కానీ, నిధుల సమస్యతో ఆయన వెనుకడుగు వేశారు. ఇక, జగన్ ఈ విషయంలో సాహసం చేసినా.. నిధులు ఇవ్వలేక సతమతం అవుతున్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం వికటించే ప్రభావం ఉందని అంటున్నారు పరిశీలకులు.