ఆ సీటు యమడేంజర్ అటగా

గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లా రాజకీయాల్లో నిన్నటివరకూ ఎదురులేని నేతగా ఉన్నారు. ఆయనది రెండు దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితం. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గంటా [more]

Update: 2019-08-08 14:30 GMT

గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లా రాజకీయాల్లో నిన్నటివరకూ ఎదురులేని నేతగా ఉన్నారు. ఆయనది రెండు దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితం. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గంటా తాజా ఎన్నికల్లో మాత్రం గట్టిగా దెబ్బ తినేశారు. ఆయన అతి స్వల్ప మెజారిటీతో గెలవడం ఒక విశేషమైతే ఆయన కొనసాగుతున్న్న తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలు కావడం మరో విశేషం. మొత్తానికి చూసుకుంతే గంటా రాజకీయ జీవితం జోరుగా సాగుతూ వచ్చి ఒక్కసారిగా బ్రేకులు పడినట్లైంది. గంటాకు ఇపుడు విపక్ష పాత్ర సూట్ అవడంలేదట. అలాగని అటు వైసీపీలోకి పోలేరు, ఇటి బీజేపీలోకి కూడా రాలేదు. మధ్యలో ఉంటూ రాజకీయ నరకాన్ని ఆయన అనుభవిస్తున్నారట.

అక్కడ నుంచి పోటీ చేస్తే అంతేనా….

గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం గెలిచిన సీటు విశాఖ ఉత్తరం. ఇది పూర్వం విశాఖ రెండవ నియోజకవర్గంగా ఉండేది. ఈ సీటు మహత్యం ఏంటంటే గతంలోనూ ఇపుడూ కూడా గెలిచిన వారు మళ్ళీ గెలవలేదు, అలాగే, వారికి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకంగా ఉంటుంది. విశాఖ ఉత్తరం సీటు 2009లో ఏర్పడింది. తొలిసారి గెలిచిన తైనాల విజయకుమార్ 2014 తరువాత రాజకీయంగా పెద్దగా బాగుపడింది లేదు. ఆయనకు టికెట్ దక్కలేదు, రాజకీయాల్లోనూ చురుకుగా లేరు. ఇక పోతే 2014లో గెలిచిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాజా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఆయనకు కూడా రాజకీయం ఏమంత బాగాలేదు. ఇక విశాఖ 2 ఏర్పడిన తరువాత పోటీ చేసిన వారంతా ఏం పెద్దగా బావుకోలేదు. 2004లో గెలిచిన ఎస్ రంగరాజు, 1999లో గెలిచిన పిన్నింటి వరలక్ష్మి, 1994లో గెలిచిన పల్లా సింహచలం వీరంతా తరువాత మళ్ళీ గెలవలేదు. రాజకీయంగా గట్టిగా నిలవలేదు. ఇక 1989లో గెలిచిన టి సూర్యనారాయణరెడ్డి సైతం ఏ పదవులు చేపట్టకుండానే రాజకీయాల నుంచి విరమించాల్సివచ్చింది.

బెంగ పడుతున్న గ్యాంగ్….

ఇపుడు గంటా అనుచరులు ఇదే తలచుకుని బెంగపడుతున్నారట. రాజకీయంగా అచ్చిరాని సీటు నుంచి తమ నాయకుడు పోటీ చేయ‌డం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కూడా వారు వాపోతున్నారట. ఇపుడు గంటా శ్రీనివాసరావు ఎటూ పోలేని అవస్థలో ఉండడానికి కారణం విశాఖ టూ సీటు మహిమ అని గట్టిగా నమ్ముతున్నారు. లేకపోతే మూడు నెలల క్రితం వరకూ తిరుగులేని నాయకుడుగా ఉన్న గంటా ఇపుడు రాజకీయ వనవాసం చేయడమేంటని వారు అంటున్నారు. విశాఖ టు, ప్రస్తుత ఉత్తరం సీటు చరిత్రను చూసి వారు జడుసుకుంటున్నారు. మరి పొలిటికల్ గా గంటాకు ఈ చికాకులు తప్పెదెలా అని కూడా ఆలోచిస్తున్నారుట. మరి వాస్తు దోషం అంటారు, అది నిజంగా ఉందేమోననిపిస్తోంది ఈ సీటు చరిత్ర వింటే. లేకపోతే ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఎవరికీ కలసిరాకపోవడమేంటి. దీని మీద గంటా శ్రీనివాసరావు ఏ శాంతులు చేయించుకుని రాజకీయంగా ముందుకు సాగుతారో చూడాలి మరి.

Tags:    

Similar News