ఆ హిస్టరీ లేకపోవడంతోనే.. అసలు భయమట
పార్టీలోనే ఉన్నానని చెబుతారు.. దీనికి రుజువులు అవసరం లేదని అంటారు.. కానీ, పార్టీ తరఫున నిర్వహించే ఏ కార్యక్రమానికీ ఆయన హాజరుకారు. అంతేకాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న [more]
పార్టీలోనే ఉన్నానని చెబుతారు.. దీనికి రుజువులు అవసరం లేదని అంటారు.. కానీ, పార్టీ తరఫున నిర్వహించే ఏ కార్యక్రమానికీ ఆయన హాజరుకారు. అంతేకాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న [more]
పార్టీలోనే ఉన్నానని చెబుతారు.. దీనికి రుజువులు అవసరం లేదని అంటారు.. కానీ, పార్టీ తరఫున నిర్వహించే ఏ కార్యక్రమానికీ ఆయన హాజరుకారు. అంతేకాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ప్రజలకు తీరని కష్టం వచ్చినప్పుడు.. టీడీపీ నాయకులు జిల్లాల నుంచి మారి.. విశాఖకు వచ్చినప్పుడు కూడా ఆయన పక్కనే ఉండి ఇంట్లో సేదదీరుతారు తప్ప.. వచ్చి నిలబడరు. మరి ఆయా విషయాలను బట్టి ఆయన పార్టీలో ఉన్నారని అనుకోవాలా ? లేక లేరని ఓ నిర్ణయానికి రావాలా ? అంటే.. ఇప్పుడు ఈ విషయమే అర్ధం కావడం లేదని అంటున్నారు మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం నుంచి గత ఏడాది జగన్ సునామీని తట్టుకుని మరీ విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు అనుచరులు.
నిలకడ రాజకీయాలు చేసే….
విషయంలోకి వెళ్తే.. ఏ పార్టీలోనూ నిలకడైన రాజకీయాలు చేసిన హిస్టరీ లేని గంటా శ్రీనివాసరావు అనేక పార్టీలు మారారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఆయన నైజం అంటారు ఆయన గురించి తెలిసిన నాయకులు. ఈ నేపథ్యంలో 2014లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు. వాస్తవానికి గంటా శ్రీనివాసరావు గురించి తెలిసిన వారు… జగన్ కొన్ని కండిషన్లు పెట్టారు కాబట్టి.. సరిపోయింది కానీ, లేకుంటే మావోడు ఎప్పుడో సైకిల్ దిగేసేవాడు.. అంటారు. గత ఏడాది విజయం సాధించిన తర్వాత కూడా ఆయన వైసీపీకి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడింది లేదు. పోనీ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నారా? అంటే అది కూడా లేదు. దీంతో ఆయన వైఖరిపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.
విశాఖ ప్రమాదం జరిగినా…
తాజాగా ఏం జరిగిందంటే.. విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో పెద్ద ప్రమాదం జరిగి దాదాపు 12 మంది మృతి చెందారు. వేల సంఖ్యలో ప్రజలు రోడ్డున పడ్డారు. నిజానికి ఈ ఘటన జరిగింది టీడీపీ నేత గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లోనే ఉంది. దీంతో వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడకు రావాలని ప్రయత్నించారు. అయితే, అది సాధ్యం కాలేదు.
చంద్రబాబు చెప్పినా…
దీంతో స్థానికంగా ఉండే నేతలను ఇక్కడకు వెళ్లి పరామర్శించి ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. దీంతో శ్రీకాకుళం నుంచి అచ్చన్నాయుడు, తూర్పుగోదావరి నుంచి చినరాజప్ప, పశ్చిమ గోదావరి నుంచి రామానాయుడు వంటి వారు హుటాహుటిన వెళ్లి బాధితులను పరామర్శించారు. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం దూరంగా ఉన్నారు. . దీంతో మరోసారిఆయన అసలు పార్టీలో ఉండాలని అనుకుంటున్నారా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. మరి గంటా శ్రీనివాసరావు వారి వ్యూహం ఏంటో.. ఎప్పటికి బయట పడుతుందో చూడాలి.