గంటాకు వచ్చిన ఆఫర్ ఇదేనా?
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటే గట్స్ ఉన్న నాయకుడుగా చెబుతారు. ఆయన ఎన్ని పార్టీలు మారినా గెలుపు మాత్రం ఆయన వైపే ఉంటోంది. తాజా ఎన్నికల్లో [more]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటే గట్స్ ఉన్న నాయకుడుగా చెబుతారు. ఆయన ఎన్ని పార్టీలు మారినా గెలుపు మాత్రం ఆయన వైపే ఉంటోంది. తాజా ఎన్నికల్లో [more]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటే గట్స్ ఉన్న నాయకుడుగా చెబుతారు. ఆయన ఎన్ని పార్టీలు మారినా గెలుపు మాత్రం ఆయన వైపే ఉంటోంది. తాజా ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఓడిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే స్వల్ప మెజారిటీతోనైనా గంటా గెలిచేశారు. ఆయన రాజకీయ సుడి అలాంటిది మరి. ఆయన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమి అనేది ఎరగలేదు, పైగా గంటా శ్రీనివాసరావు అనుకున్న గురి తప్పలేదు. తాజా ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని గంటా శ్రీనివాసరావుకు తెలుసు కానీ జగన్ చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో గంటా టీడీపీలో బలవంతాన ఉండిపోయారని అంటారు. ఇపుడు ఆయన టీడీపీకి విడాకులు ఇచ్చేందుకు సిధ్ధపడుతున్నారని అంటున్నారు.
జగన్ ఒకే అన్నారట…
గంటా శ్రీనివాసరావు రాజకీయం ముందు ఏవీ అడ్డంకులు కావు. ఓ వైపు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి, గంటా ఒకనాటి మిత్రుడు అయినా అవంతి శ్రీనివాసరావు వద్దు అంటున్నా కూడా గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరిక దాదాపుగా ఖాయం అయిపోయినట్లుగా కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు ఈ మేరకు రాయబేరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. జగన్ సన్నిహితుల ద్వారా గంటా శ్రీనివాసరావు కధ మొత్తం నడిపారని అంటున్నారు. ఇక గంటా చేరికకు ఆమోదముద్ర వేశారని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్న జగన్ కి వేరే వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. విశాఖ జిల్లాలో టీడీపీని దెబ్బకొట్టాలంటే గంటా శ్రీనివాసరావు లాంటి వారిని లాగేయడమే మంచిదని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.
పదవీత్యాగమేనా…?
ఇక జగన్ పెట్టిన అన్ని షరతులు కూడా గంటా శ్రీనివాసరావు ఒప్పుకుని మరీ టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారని అంటున్నారు. ఉత్తరం ఎమ్మెల్యే సీటుకు గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తారన్న వార్తలు ఇపుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ విధంగా గంటా శ్రీనివాసరావు సరికొత్త సంప్రదాయాన్ని సృష్టించి మరీ వైసీపీ చేరడమే కాదు, ఇతర నేతలకు కొత్త మార్గం చూపిస్తున్నారని అంటున్నారు. దసరా ముందు కానీ తరువాత కానీ గంటా శ్రీనివాసరావు రాజీనామా ఉంటుందని విశాఖ జిల్లా రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇక గంటాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జగన్ అవకాశం ఇస్తారా లేక ఆయనకు వేరే పదవి ఏదైనా ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. గంటా శ్రీనివాసరావును రాజ్యసభకు పంపడం ద్వారా ఆయన సేవలను ఢిల్లీ రాజకీయాల్లో వాడుకోవాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే గంటా శ్రీనివాసరావుతో పాటు పెద్ద వర్గమే టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తోందని అంటున్నారు.