గంటాకు సైడ్ ఇచ్చేసిన సాయిరెడ్డి ?

మొత్తానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రవేశానికి లైన్ క్లియర్ అయింది. చాలా తొందరలోనే ఈ పొలిటికల్ న్యూస్ ని అంతా వినేయవచ్చు. ఇక్కడ గంటా [more]

Update: 2020-10-09 03:30 GMT

మొత్తానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రవేశానికి లైన్ క్లియర్ అయింది. చాలా తొందరలోనే ఈ పొలిటికల్ న్యూస్ ని అంతా వినేయవచ్చు. ఇక్కడ గంటా రాజకీయ చాతుర్యాన్ని కూడా మెచ్చాల్సిందే. కాదన్న వారి చేత అవును అనిపించడమే రాజకీయం. పైగా అదే అసలైన చాణక్యం, విముఖులను సుముఖులుగా మార్చుకుని తన రాజకీయానికి బాటలు వేసుకున్న గంటా శ్రీనివాసరావు తీరుకి, జోరుకు శభాష్ అనాల్సిందే. గంటా రాకకు ఆది నుంచి అడ్డంకులు సృష్టించిన జగన్ కుడి భుజం వైసీపీలో దిగ్గజ నేత అయిన ఎంపీ విజయసాయిరెడ్డి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్న టాక్ ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు రాకకు ఆ విధంగా గేట్లు ఎత్తేశారని కూడా అంటున్నారు.

ఏడాదిగా తపస్సు….

గంటా శ్రీనివాసరావు గత ఏడాదిగా తపస్సే చేస్తున్నారు. ఆయన ఎపుడైతే విపక్ష ఎమ్మెల్యే అయ్యారో నాడే టీడీపీకి స్వస్తివాచకం పలికేశారు. వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి నాటి నుంచే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మొదట్లో విజయసాయిరెడ్డి ఒప్పుకున్నా జగన్ పచ్చ జెండా ఊపలేదు. ఆ తరువాత జగన్ సరేనంటే విజయసాయిరెడ్డి బిగపట్టికూర్చున్నాడు. దానికి కారణం సజ్జల రామక్రిష్ణారెడ్డి, తనకు చెప్పకుండా గంటాను ఆయన పార్టీలో చేర్పిస్తే చూస్తూ ఎలా ఊరుకుంటానని విజయసాయిరెడ్డి పట్టుదలకు పోయారు. అసలు గంటాయే వద్దు అంటూ జగన్ కి గట్టిగా చెప్పారు. గంటా శ్రీనివాసరావు చుట్టూ ఉన్న వారిని చేర్పించి ఆయన్ని ఒంటరిని చేయాలని చూశారు. చివరికి జగన్ మనసులో గంటా ఉన్నారని తెలుసుకుని సైడ్ ఇచ్చెశారని అంటున్నారు.

ప్రసన్నం చేసుకున్నాకే …..

ఇక గంటా శ్రీనివాసరావు సైతం తాను మొదట్లో దూకుడుగా చేసిన తప్పుని తెలుసుకుని విజయసాయిరెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు గట్టిగా యత్నించారట. దాంతో నెల్లూరు పెద్దాయన పడిపోయారని వెల్ కం టు వైసీపీ అంటూ ఆయనే స్వయంగా ఆహ్వానించారని అంటున్నారు. విశాఖ జిల్లా రాజకీయాల్లో ధీటు అయిన నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తే మొత్తం విశాఖ రాజకీయం ఆ పార్టీ చేతిల్లోకి వచ్చేసినట్లే. గంటా వంటి బిగ్ షాట్ కావాలని ఏరి కోరి మరీ జగన్ ఆయన్ని చేర్చుకుంటున్నారని కూడా అంటున్నారు.

ఇక లాంచనమే …..

గంటా ఏ క్షణాన అయినా వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన వర్గం నుంచి వినిపిస్తున్న మాట. తొందరలోనే మంచి ముహూర్తాలు ఉన్నందున వీలు చూసుకుని మరీ గంటా శ్రీనివాసరావు జగన్ సమక్షంలో పార్టీ మద్దతుదారుగా మారుతారని అంటున్నారు. తన కుమారుడు రవితేజను పార్టీలో చేర్పించి తాను అనధికార సభ్యుడిగా మారుతారని అంటున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాసరావు మార్క్ రాజకీయంలో బకరా అయ్యేది మాత్రం మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. ఆయన గంటా రాకను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఆయన దీని మీద ఎలా స్పందిస్తారు అన్నదే చూడాలి మరి.

Tags:    

Similar News