Tdp : గిడ్డి ఈశ్వరికి ఇక గుడ్ డేస్ అట

వైసీపీలో విభేదాలు తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేలా ఉన్నాయి. అనేక నియోజకవర్గాలలో బయపడుతున్న వైసీపీ నేతల మధ్య వైరం విపక్ష టీడీపీకి అనుకూలంగా మారనుంది. స్థానిక ఎమ్మెల్యేలపై [more]

;

Update: 2021-10-19 00:30 GMT

వైసీపీలో విభేదాలు తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేలా ఉన్నాయి. అనేక నియోజకవర్గాలలో బయపడుతున్న వైసీపీ నేతల మధ్య వైరం విపక్ష టీడీపీకి అనుకూలంగా మారనుంది. స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. పాడేరు నియోజకవర్గంలో పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడ టీడీపీ నేత గిడ్డి ఈశ్వరికి మంచి రోజులొస్తున్నాయన్న సంకేతాలు కన్పిస్తున్నాయి.

స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నా….

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీికి గట్టి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. వరసగా వైసీపీ 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ జెండా ఎగురవేస్తూ వస్తుంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరి తర్వాత టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో అక్కడ 2019 ఎన్నికల్లో భాగ్యలక్ష్మిని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టడంతో తిరిగి గెలుచుకుంది. అయితే భాగ్యలక్ష్మిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేను వ్యతిరేకించే వర్గం స్ట్రాంగ్ అవుతుంది.

ఎమ్మెల్యే పై వ్యతిరేకత….

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఈ విభేదాలను మరింత రచ్చ కీడ్చాయి. ఎమ్మెల్యే పోటీలోకి దింపిన అభ్యర్థులు కాకుండా రెబల్స్ ఇక్కడ విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాడేరు, చింతపల్లి, మాడుగుల జడ్పీటీసీలు వైసీీపీ రెబల్స్ గెలిచారు. ఇది ఎమ్మెల్యే కు మింగుడు పడని అంశమే. దీంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రంగంలోకి దిగారు. వైసీపీ రెబల్స్ ను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

బుజ్జగించే ప్రయత్నాలు…

ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్న వైైసీపీ నేతలకు వేరే ప్రత్యామ్నాయం లేదు. వచ్చే ఎన్నికల్లో తిరిగి భాగ్యలక్ష్మిని అభ్యర్థిగా పోటీకి దింపితే తాము వ్యతిరేకిస్తామని ఇప్పటికే వారు హెచ్చరికలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మిని వ్యతిరేకిస్తున్న నేతలను గిడ్డి ఈశ్వరి బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికిప్పుడు వారు గిడ్డి ఈశ్వరికి మద్దతు తెలపకపోయినా వచ్చే సాధారణ ఎన్నికల్లో భాగ్యలక్ష్మిని వైసీపీ బరిలోకి దింపితే వీరంతా గిడ్డి ఈశ్వరికి చేరువయ్యే అవకాశముంది. మొత్తం మీద తనకు మంచి రోజులొస్తున్నాయని గిడ్డి ఈశ్వరి భావిస్తున్నారు.

Tags:    

Similar News