బుచ్చన్నకు పట్టు జారిపోతుందా?

తెలుగుదేశం పార్టీ లో సీినియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు కూడా తక్కువనే చెప్పాలి. వయసు దృష్ట్యా ఆయన [more]

Update: 2021-02-26 03:30 GMT

తెలుగుదేశం పార్టీ లో సీినియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు కూడా తక్కువనే చెప్పాలి. వయసు దృష్ట్యా ఆయన తన వారసుడిని రాజకీయాల్లోకి వచ్చే ఎన్నికల్లోనే తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ టీడీపీకి లాయల్ గా ఉండే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్ని సార్లు గెలిచినా ఆయనకు పదవులు దక్కలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనను అధిష్టానం విస్మరించింది.

అధికారంలో లేనప్పడు మాత్రం…..

అధికారంలో లేనప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అవసరం పార్టీకి ఏర్పడుతుంది. అయితే ఈసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. గత ఎన్నికలకు ముందే ఆయన పార్టీ అధినాయకత్వంపై తన నిరసనను వ్యక్తం చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంపైనే పట్టు ఎక్కువగా ఉంది. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి పంపారు. అక్కడా వైసీపీ హోరులో బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు.

ఆధిపత్య పోరు…

కానీ రూరల్ లో బుచ్చయ్య చౌదరి గెలిచినప్పటికీ ఆయన మనసంతా రాజమండ్రి అర్బన్ పైనే ఉంది. అక్కడ టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ గెలిచారు. ఆదిరెడ్డి కుటుంబానికి, బుచ్చయ్య చౌదరికి పడదు. గత ఇరవై నెలల నుంచి ఇక్కడ ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. రాజమండ్రి అర్బన్ ప్రాంతంలో బుచ్చయ్య చౌదరి వేలు పెట్టడాన్ని ఆదిరెడ్డి కుటుంబం అభ్యంతరం తెలుపుతోంది. ఈ నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ ప్రాంతంపై పట్టు కోల్పోతున్నారంటున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో…..

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రజలు షాక్ ఇచ్చారు. ఇక్కడ అధిక పంచాయతీల్లో వైసీపీ యే గెలిచింది. దీనికి కారణం టీడీపీ నేతలే సహకరించలేదన్నది బుచ్చయ్య చౌదరి వాదనగా విన్పిస్తుంది. సీనియర్ నేతగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ఇలాకానే పార్టీని పడుకోబెట్టేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పడు పార్టీలో బుచ్చయ్య చౌదరి హాట్ టాపిక్ గా మారారు. పంచాయతీ ఎన్నికలలో ఓటమికి గల కారణాలను బుచ్చయ్య చౌదరి పార్టీలోని ప్రత్యర్థులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News