గోరంట్ల గూగ్లీ వేసింది అందుకేనా?
పంచాయితీ స్థానిక ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీకి మంగళం పాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది. ఇలా వెళుతున్న వారు అగ్రశ్రేణి నాయకులు అయితే ఫర్వాలేదు. [more]
;
పంచాయితీ స్థానిక ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీకి మంగళం పాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది. ఇలా వెళుతున్న వారు అగ్రశ్రేణి నాయకులు అయితే ఫర్వాలేదు. [more]
పంచాయితీ స్థానిక ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీకి మంగళం పాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది. ఇలా వెళుతున్న వారు అగ్రశ్రేణి నాయకులు అయితే ఫర్వాలేదు. కానీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు నేరుగా ఫ్యాన్ కిందకు వెళ్ళి సేదతీరుతున్నారు. ఇదే పార్టీ అగ్రనాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న అంశం. శ్రేణుల్లో నైతిక స్థైర్యం సన్నిగిల్లడంతో పాటు చంద్రబాబు కు వయస్సు మీద పడుతూ ఉండటంతో తమ భవిష్యత్తును పసుపు పార్టీలో ఉండి బుగ్గిపాలు చేసుకోవడం మంచిది కాదనే అభిప్రాయం క్రమంగా పెరుగుతూ పోతుంది. దీన్ని గమనించి నష్టనివారణ చర్యలు చేపట్టాలిసిన అధిష్టానం సీరియస్ గా వలసలకు అడ్డుకట్ట వేయలేని దుస్థితి టిడిపి లో రాజ్యమేలుతుంది.
పెనుమార్పులు తప్పవు …
టిడిపి ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో ఉన్న నేతగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంచి గుర్తింపు వుంది. ఎన్టీఆర్ అనుంగు సహచరుడిగా హల్చల్ చేసిన ఆయన చంద్రబాబు జమానాలో వెనుకబడ్డారు. అయినప్పటికీ పార్టీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియారిటీ ని గుర్తించి ఎట్టకేలకు ఇటీవల చిన్నన్నకు పాలిట్ బ్యూరో పదవిని బాబు ప్రసాదించారు. వయస్సు మీద పడుతున్నా కుర్రాళ్లతో పోటీ పడేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం పాలిట్ బ్యూరో పదవి వచ్చాక దూసుకుపోతున్నారు. నిత్యం టివి డిబేట్ల లోను సోషల్ మీడియా లోను తనదైన రీతిలోనే రాణిస్తున్నారు. అలాంటి గోరంట్ల తాజాగా పార్టీ ఆవిర్భావం రోజు చేసిన వ్యాఖ్య ఇప్పుడు తెలుగుదేశంలో తీవ్ర చర్చకు తెరతీసింది. పార్టీలో ప్రక్షాళన మొదలు కావాలిసిన తరుణం ఆసన్నం అయ్యిందని పేర్కొంటూ త్వరలో జూనియర్ ఎన్టీఆర్ వస్తారని యువరక్తం ఎక్కించాలంటూ కామెంట్ చేశారు.
నిన్నటివరకు వైసిపి …
స్థానిక ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత వైసిపి నేతలంతా టిడిపి పని ముగిసిందన్నారు. కొందరైతే ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప ఛరిష్మా లేదని చంద్రబాబు తో జగన్ ను ఢీ కొనడం సాధ్యం కాదంటూ పేర్కొన్నారు. ఇది వైసిపి మైండ్ గేమ్ లో భాగమని టిడిపి వర్గాలు కొట్టి పారేసిన సందర్భం ఉంది. అయితే ఇదే చర్చ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారి నోటి నుంచి మొదలు కావడంతో ఇక చంద్రబాబు జూనియర్ ను బుజ్జగించి పార్టీని రక్షించే పని చేపట్టక తప్పదా అనే ప్రశ్న ఇప్పుడు పసుపు దళంలో వినిపిస్తుంది. అదే జరిగితే నారా లోకేష్ పాత్రను పరిమితం చేస్తారా ? జూనియర్ కు ఏ స్థానం ఇస్తారు వంటి చర్చలు మరో పక్క నడుస్తున్నాయి. మరోపక్క ఇప్పట్లో రాజకీయ ప్రవేశం లేదని దానికి చాలా సమయం ఉందంటూ ఇటీవలే ఒక సినిమా ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో నాయకత్వ మార్పుపై టిడిపి లో ఏమి జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది.