బుచ్చయ్య అసలు టార్గెట్ బాబు కాదట.. వారేనట
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కల్గించాయి. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్ కావాలని కోరారు. [more]
;
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కల్గించాయి. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్ కావాలని కోరారు. [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కల్గించాయి. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్ కావాలని కోరారు. అంతే కాదు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. అయితే అందరూ అనుకున్నట్లు బుచ్చయ్య టార్గెట్ చంద్రబాబు కానే కాదట. ఆయన యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు కుటుంబాలను టార్గెట్ చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు.
వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా….
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. ఎన్టీరామారావు ఉన్నప్పుడు ఆయన ఒక వెలుగు వెలిగారు. తర్వాత నుంచి ఆయనను పార్టీలో ఒక నేతగానే చూశారు. తమలో కలుపుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించలేదు. దీనికి ప్రధాన కారణం యనమల రామకృష్ణుడు. తనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం కూడా యనమల రామకృష్ణుడేనని తన సన్నిహితుల వద్ద గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.
పాతుకుపోయిన నేతలు….
యనమల కారణంగానే తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ భ్రష్టుపట్టి పోయిందని కూడా అంతర్గత సంభాషణల్లో ఆయన చెప్పుకొచ్చారు. అందుకే కుటుంబ రాజకీయాలను కూడా పక్కన పెట్టాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కామెంట్స్ చేశారంటున్నారు. నలభై ఏళ్ల నుంచి కొందరు నేతలు పాతుకు పోవడం వల్ల కొత్త నాయకత్వం ఎదగలేకపోతుందని అనడానికి కూడా కారణం యనమల రామకృష్ణుడిని ఉద్దేశించి అని చెబుతున్నారు.
కుటుంబ పెత్తనాలపై….?
దీనికి తోడు రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం పార్టీ ని వీడివెళ్లి వచ్చినా వారికి మళ్లీ పదవులు, బాధ్యతలను అప్పగించడంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఆమె సోదరుడు ఎంపీగా, ఆమె బాబాయి అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక పదవులను ఒకే కుటుంబానికి ఇవ్వడాన్ని కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్పుపడుతున్నారు. ఇలాగే పాతుకుపోయిన నేతలను అంటిపెట్టుకుని ఉంటే పార్టీకి మనుగడ ఉండదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుండ బద్దలు కొడుతున్నారు. ఆయన యనమల, అచ్చెన్నాయుడులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు.