సీనియారిటీ ఉన్నా ఏం లాభం?
అధికారం కోల్పోయినా అహం మాత్రం చావలేదు. ప్రజలు పార్టీని చిత్తుగా ఓడించినా కలసి కట్టుగా పనిచేద్దామన్న స్పృహ సీనియర్ నేతలకే లేకపోవడం విశేషం. తెలుగుదేశం పార్టీ అసలే [more]
;
అధికారం కోల్పోయినా అహం మాత్రం చావలేదు. ప్రజలు పార్టీని చిత్తుగా ఓడించినా కలసి కట్టుగా పనిచేద్దామన్న స్పృహ సీనియర్ నేతలకే లేకపోవడం విశేషం. తెలుగుదేశం పార్టీ అసలే [more]
అధికారం కోల్పోయినా అహం మాత్రం చావలేదు. ప్రజలు పార్టీని చిత్తుగా ఓడించినా కలసి కట్టుగా పనిచేద్దామన్న స్పృహ సీనియర్ నేతలకే లేకపోవడం విశేషం. తెలుగుదేశం పార్టీ అసలే దీనావస్థలో ఉంది. గత ఎన్నికల్లో ప్రజలు చూపిన తిరస్కారాన్ని ఇంకా నేతలు మర్చిపోలేకపోతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు సమిష్టి కృషి అవసరం. అయినా సరే తమకు రాజకీయమే ముఖ్యమంటున్నారు సీనియర్ నేతలు. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం ఇప్పుడుపార్టీలో చర్చనీయాంశమైంది.
ఆధిపత్యం కోసం…..
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. అర్బన్ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి భవానీ విజయం సాధించారు. ఇద్దరూ కలసి కట్టుగా పనిచేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. కానీ తనకు దశాబ్దాలుగా పట్టున్న అర్బన్ నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రయత్నిస్తున్నారు. అర్బన్ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదిరెడ్డి కుటుంబానికి చికాకులు తెప్పిస్తున్నారు.
రూరల్ నియోజకవర్గంలో….
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఆయన అర్బన్ లో వేలుపెడుతున్నారు. అమరావతి రైతులకు సంఘీభావంగా ఆయన రాజమండ్రిలో కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ఆదిరెడ్డి కుటుంబం తప్పపడుతోంది. దీనిపై పార్టీ అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అధిష్టానానికి ఫిర్యాదు చేసినా…..
కానీ పార్టీ అధినాయకత్వం ఇప్పుడు ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అర్బన్ లో నిత్యం చికాకులు కల్పిస్తున్నారు. అధినాయకత్వం తనను ప్రశ్నించలేదన్న ధీమాతోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తరచూ వివాదాలను కొని తెస్తున్నట్లు చెబుతున్నారు. అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆదిరెడ్డి కుటుంబం ఆగ్రహంగా ఉందంటున్నారు. అచ్చెన్నాయుడు రాష్ఠ్ర అధ్యక్షుడు అయితే అప్పుడు చూసుకోవచ్చని ఆదిరెడ్డి కుటుంబం కామ్ ఉందంటున్నారు. మొత్తం మీద సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి కుటుంబాన్ని చికాకు తెప్పిస్తున్నారనే చెప్పాలి.