గోరంట్ల కల ఫలించిందా …?
ఆయనకు టైం వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళు పార్టీలో కానీ పదవుల్లో కానీ ఆయనకు గుర్తింపు లభించలేదు. ఆయనే ఎన్టీఆర్ జమానా లో చిన్నన్న [more]
;
ఆయనకు టైం వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళు పార్టీలో కానీ పదవుల్లో కానీ ఆయనకు గుర్తింపు లభించలేదు. ఆయనే ఎన్టీఆర్ జమానా లో చిన్నన్న [more]
ఆయనకు టైం వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళు పార్టీలో కానీ పదవుల్లో కానీ ఆయనకు గుర్తింపు లభించలేదు. ఆయనే ఎన్టీఆర్ జమానా లో చిన్నన్న గా గుర్తింపు పొంది ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడిగా, మంత్రిగా పదవులు చేపట్టి ఆ తరువాత చంద్రబాబు హయాంలో కరివేపాకు అయిపోయిన మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇప్పుడు ఆయన కల ఎట్టకేలకు ఫలించింది. ఎప్పటినుంచో కోరుకుంటున్న గుర్తింపు పార్టీలో కీలకమైన పాలిట్ బ్యూరో సభ్యుడి రూపంలో దక్కింది. 1983 నుంచి రాజకీయాల్లో ఉంటూ పార్టీ నుంచి 9 సార్లు ఎమ్యెల్యే టికెట్ సాధించి ఆరు సార్లు గెలిచిన గోరంట్ల బాబు హయాంలో తనకు తగిన గుర్తింపు లభించలేదని మదన పడేవారు. ప్రస్తుతం పార్టీ క్లిష్ట సమయంలో ఆయనకు శాసన సభలో విపక్ష ఉప నేత హోదా దక్కినా పార్టీలో మరింత చురుకైన పాత్ర ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరుకున్నారు. ఆశించినట్లే ఆయనకు ఈసారి చంద్రబాబు తగిన విధమైన గుర్తింపు ఇచ్చారు.
కులమే శాపం అయ్యింది …
గోదావరి జిల్లాల్లో ఉండే రాజకీయ నేతలు కమ్మ, రెడ్డి కులమై ఉన్నవారైతే వారిలో ప్రతిభ ఉన్నా పదవుల ఎంపికలో అధిష్టానాలు పక్కన పెట్టక తప్పదు. నేటి రాజకీయాల్లో సామాజిక వర్గ సమతూకంలో అలా చాలామంది ఈ జిల్లాల్లో అనివార్యంగా వెనుకబడక తప్పడం లేదు. ఆ కోవలోకే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చి చేరతారు. ఎన్టీఆర్ తరువాత ఆయనకు పార్టీలో కమ్మ సామాజికవర్గం కావడమే మైనస్ అయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలో కాపు, బిసి, ఎస్సి లకు సామాజికపరంగా అధిష్టానాలు పదవులు దక్కేలా చూస్తూ ఉంటాయి. ఈ ఈక్వేషన్స్ అనేక సార్లు అధికార పదవులను, పార్టీ పదవులను కూడా గోరంట్లకు దూరం చేసేసింది. అయినప్పటికీ ఆయన ప్రయత్నాలు ఎక్కడా విరమించలేదు. అధిష్టానం తో పంచాయితీలు పెట్టుకోలేదు. తన పని తాను చేసుకుంటూ సాగిపోయేవారు. అదే ఇప్పుడు బాబు ను ఆకర్షించింది.
యనమల తో సఖ్యత లేకపోవడం …
తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిందే టిడిపి లో వేదం. ఎన్టీఆర్ పదవీచ్యుతిలో కీలక భూమిక వహించిన నాటి స్పీకర్ గా యనమల ఉండటం చంద్రబాబు తో ఆయన సాన్నిహిత్యాన్ని బాగా పెరిగేలా చేసింది. ఎన్టీఆర్ బతికి ఉన్నంతకాలం ఆయనతో ఆ తరువాత కొంతకాలం లక్ష్మీపార్వతి వర్గంతో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇవే మైనస్ లు అయ్యాయి. అదీ గాక ఆయన తొలినాళ్లలో ఎన్టీఆర్ పెద్దల్లుడు డా. దగ్గుబాటి వెంకటేశ్వర రావు గ్రూప్ లో కొనసాగడం జరిగింది. ఇలాంటివన్నీ కలిసి గోరంట్ల రాజకీయ ఎదుగుదలకు బ్రేక్ లు వేసేలా చేసింది.
ఇదే లాస్ట్ అనడంతోనేనా … ?
ప్రతి ఎన్నికలకు ముందు ఇదే నేను చివరిగా పోటీ చేసే ఎన్నిక అని ప్రకటించడం గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి కొత్తకాదు. తాజాగా కూడా వయస్సు రీత్యా కూడా భారం పడటంతో ఆయనకు మరో ఛాన్స్ లోకేష్ జమానాలో వచ్చే అవకాశాలు లేవనే విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో కీలకమైన సీనియర్ నేత అనుభవాలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గట్టెక్కించడానికి అవసరమని బాబు లెక్కేసే చిన్నన్న కోరుకున్న పదవిని ఇప్పటికి ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో తనదైన ముద్రను వేసేందుకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇకపై ఏమి చేయనున్నారన్నది ఆసక్తికరం.