బుచ్చయ్య రాజీనామా.. కోపమంతా ఆయనపైనేనా?

గోరు చుట్టు మీద రోకటి పోటు అంటే ఇలాంటిదే. అసలే కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య [more]

;

Update: 2021-08-19 08:00 GMT

గోరు చుట్టు మీద రోకటి పోటు అంటే ఇలాంటిదే. అసలే కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయడం ఆశ్చర్యకరం. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం విశేషం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలి నుంచి పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక వెనుదిరగలేదు. వలస వచ్చినా రాజమండ్రిని తన అడ్డాగా చేసుకుని రాజకీయంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎదగగలిగారు.

తొలినుంచి ఎన్టీఆర్ వెంటే….

గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలి నుంచి ఎన్టీఆర్ పట్ల సానుకూలత ఉన్నవారు. ఎన్టీఆర్ హయాంలోనే ఆయనకు మంత్రి పదవి దక్కింది. 1995లో సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ వెంటే నిలిచారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా లక్ష్మీపార్వతి నిర్వహించిన సభల్లోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఆ తర్వాత తిరిగి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో చేరారు.

బాబు నిర్ణయాలను….

గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్పు పట్టారు. ఇతర పార్టీల వారి పెత్తనం ఎక్కువయిందని ఆయన అనేకసార్లు తప్పుపట్టారు. సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

తన ప్రత్యర్థులకు మద్దతిస్తూ…

అలాగే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్పు పట్టారు. దీనికి తోడు జిల్లా రాజకీయాలు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామాకు కారణంగా చెబుతున్నారు. రాజమండ్రి నుంచి టీడీపీ తరుపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే తన ప్రత్యర్థి వర్గానికి పార్టీ మద్దతిస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్రుగా ఉన్నారు. ఆదిరెడ్డికి పరోక్షంగా అచ్చెన్నాయుడు మద్దతు ఇవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ఇలా పార్టీలో ఇబ్బందిగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి చివరకు రాజీనామా చేసేందుకు డిసైడ్ అయ్యారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వార్తలతో అధిష్టానం అప్రమత్తమయింది. చంద్రబాబు నేరుగా ఆయనతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. బుచ్చయ్య చౌదరిని బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News