ఆ యువ ఎమ్మెల్యేకు కాపు కోటాలో బెర్త్ ఖాయ‌మే ?

విశాఖ జిల్లా రాజకీయాల్లో వైసీపీ తరఫున చురుకైన నాయకుడిగా గుడివాడ అమరనాధ్ ఉన్నారు. ఆయనది రాజకీయ కుటుంబం. తాత గుడివాడ అప్పన్న పెందుర్తి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే, [more]

;

Update: 2021-08-30 03:30 GMT

విశాఖ జిల్లా రాజకీయాల్లో వైసీపీ తరఫున చురుకైన నాయకుడిగా గుడివాడ అమరనాధ్ ఉన్నారు. ఆయనది రాజకీయ కుటుంబం. తాత గుడివాడ అప్పన్న పెందుర్తి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే, తండ్రి గుడివాడ గురునాధరావు అదే పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆ తరువాత ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఇక మూడవ తరంలో గుడివాడ అమరనాధ్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన జీవీఎంసీ కార్పోరేటర్ గా పనిచేశారు. ఇక వైసీపీ ఆవిర్భావంతోనే ఆయన అందులో చేరిపోయారు. 2014 ఎన్నిక‌ల వేళ ఉమ్మ‌డి విశాఖ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశారు.

పార్టీ కోసం త్యాగాలు…..

2014లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గుడివాడ అమరనాధ్ ఓడారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం అదే అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా జెండా ఎగరవేశారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు పార్టీ కోసం చేసిన త్యాగాల నేప‌థ్యంలో ఆయన మంత్రి కావడం ఖాయమని అంతా భావించారు. అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అవంతి శ్రీనివాసరావుకు ఇచ్చిన మాట మేరకు మంత్రి పదవిని మొదట ఆయనకు కట్టబెట్టారు. దాంతో కొంత అసంతృప్తికి గుడివాడ అమరనాధ్ గురి అయినా కూడా ఈసారి విస్తరణలో తప్పకుండా తీసుకుంటామని జగన్ హామీ ఇవ్వడంతో శాంతించారు. ఆయన విస్తరణ కోసం ఎదురుచూస్తున్నారు. మరో వైపు విజయసాయిరెడ్డికి కూడా అత్యంత విధేయుడిగా ఉంటున్నారు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన గుడివాడకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు అయితే ధీమాగా ఉన్నారు.

ప్రత్యేక అభిమానం…..

మరో వైపు జగన్ కి గుడివాడ అమరనాధ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని చెబుతారు. పైగా యువ నాయకుడు కాబట్టి ఆయనను ప్రోత్సహించాలని కూడా అనుకుంటున్నారు. విశాఖ జిల్లా నుంచి గట్టిగా వైసీపీ వాయిస్ వినిపించేవారిలో గుడివాడ అమరనాధ్ ముందుంటారు. విపక్షాల మీద ఆయన చేసే కామెంట్స్ కానీ వేసే పంచులు కానీ గట్టిగానే ఉంటాయి. దాంతో ఆయనకే ఛాన్స్ అన్న మాట ఉంది. అయితే విశాఖ జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఇదే కాపు వ‌ర్గంలో చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. దాంతో జగన్ ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది కూడా చర్చగానే ఉంది. అయితే ధ‌ర్మ‌శ్రీకి కొన్ని విష‌యాల్లో దూకుడుగా ఉండడం.. విజ‌య‌సాయినే విబేధించ‌డం ఆయ‌న‌కు మైన‌స్ అయ్యింది.

ప్రత్యేక అవకాశం….

గుడివాడ అమరనాధ్ మాత్రం ఏ నాడు జ‌గ‌న్‌, విజ‌య‌సాయి మాట జ‌వ‌దాట‌లేదు. అయితే ఈ మధ్య స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించవద్దు అంటూ అసెంబ్లీలో చేసిన తీర్మనం సందర్భంగా మాట్లాడే అవకాశం విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమరనాధ్ కే ఇచ్చారు. దాని బట్టి చూస్తే జగన్ ఓటు గుడివాడకే అని తేలిపోయింది అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఫైన‌ల్ ట‌చ్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.

Tags:    

Similar News