Tdp : ఎన్నాళ్లకెన్నాళ్లకు…. కల నెరేవేరిందిగా?
తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పార్టీలో ఉన్న అతి కొద్ది మంది నేతల్లో గుమ్మడి సంధ్యారాణి ఒకరు. ఎస్టీ సామాజికవర్గం నుంచి వచ్చిన ఆమె పార్టీనే నమ్ముకుని రాజకీయాల్లో [more]
;
తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పార్టీలో ఉన్న అతి కొద్ది మంది నేతల్లో గుమ్మడి సంధ్యారాణి ఒకరు. ఎస్టీ సామాజికవర్గం నుంచి వచ్చిన ఆమె పార్టీనే నమ్ముకుని రాజకీయాల్లో [more]
తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పార్టీలో ఉన్న అతి కొద్ది మంది నేతల్లో గుమ్మడి సంధ్యారాణి ఒకరు. ఎస్టీ సామాజికవర్గం నుంచి వచ్చిన ఆమె పార్టీనే నమ్ముకుని రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె ఎన్నాళ్ల నుంచో కోరుతున్న డిమాండ్ ను నేడు చంద్రబాబు నెరవేర్చారు. సాలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జిగా గుమ్మడి సంధ్యారాణిని నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఆమె సాలూరు నుంచి గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారు.
సుదీర్ఘకాలంగా….
గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. నిజానికి ఆమెకు 2009లోనే చంద్రబాబు టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పీడిక రాజన్న దొర చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కేవలం 1800 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత వరసగా రెండు ఎన్నికల్లో గుమ్మడి సంధ్యారాణిని చంద్రబాబు పక్కన పెట్టి మరో గిరిజన నేత భంజ్ దేవ్ కు టిక్కెట్ ఇచ్చారు. ఆయన కూడా గెలవలేదు. అంటే సాలూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచి వచ్చే ఎన్నికల నాటికి రెండు దశబ్దాలు అవుతుంది.
పార్టీకి పట్టున్నా…
నిజానికి సాలూరు నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. 1994, 1999, 2004లో వరసగా టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన మూడు వరస ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భంజ్ దేవ్ వర్గాన్ని పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. మూడు ఎన్నికల నుంచి ఎలాంటి పట్టు సాధించకపోవడం వల్లనే గుమ్మడి సంధ్యారాణి ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లోనే….
2014 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే చంద్రబాబు గుమ్మడి సంధ్యారాణికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆమె గత ఎన్నికల సమయంలోనే సాలూరు టిక్కెట్ ను ఆశించినా దక్కలేదు. ఎమ్మెల్సీగా ఉండి ఎక్కువగా సాలూరు నియోజకవర్గంపైనే ఆమె దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న పీడిక రాజన్న దొరను ఈమె ఎదుర్కొనాల్సి ఉంటుంది. దాదాపు దశాబ్దకాలం తర్వాత గుమ్మడి సంధ్యారాణి కలనెరవేరినట్లే చెప్పుకోవాలి.