ఆయన అందుకే అంత స్లో అయ్యారా?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇటీవల కాలంలో కొంత స్లో అయ్యారు. ప్రధానంగా ఏపీ రాజకీయాల విషయంలో ఆయన పెద్దగా తలదూర్చడం లేదు. పోలవరం విషయంలోనూ [more]

;

Update: 2020-12-11 14:30 GMT

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇటీవల కాలంలో కొంత స్లో అయ్యారు. ప్రధానంగా ఏపీ రాజకీయాల విషయంలో ఆయన పెద్దగా తలదూర్చడం లేదు. పోలవరం విషయంలోనూ పెద్దగా స్పందించలేదు. దీనికి ప్రధాన కారణం తనపై వైసీపీ ముద్ర పడటమే కారణమంటున్నారు. గతంలో దూకుడు మీద ఉండే జీవీఎల్ నరసింహారావు ఏపీ పాలిటిక్స్ లో జోక్యం చేసుకోకపోవడానికి ప్రధానంగా టీడీపీ యే కారణమన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

టీడీపీ సక్సెస్ అయిందా?

ఒక రకంగా జీవీఎల్ నరసింహారావు ను కట్టడి చేయడంలో టీడీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. జీవీఎల్ నరసింహారావు జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనను ఒకసారి కలిశారు. అంతేకాకుండా వైసీపీకి అనుకూలంగా ఉంటారన్న విమర్శలూ ఉన్నాయి. ప్రధానంగా జీవీఎల్ నరసింహారావు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేస్తారని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా టీడీపీ జీవీఎల్ ను ట్రోల్ చేసేది.

ట్రోల్ చేస్తూ…..

జగన్ బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ కు జీవీఎల్ నరసింహారావు దగ్గర బంధువంటూ టీడీపీ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై జీవీఎల్ వివరణ ఇచ్చుకున్నారు. తనకు బ్రదర్ అనిల్ కుమార్ కు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ సోషల్ మీడియా మాత్రం జీవీ‌ఎల్ నరసింహారావును ఎప్పటికప్పడు కార్నర్ చేస్తూనే ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో జీవీఎల్ కొంత స్లో అయ్యారంటున్నారు.

వీర్రాజు తర్వాత……

దీంతో పాటు సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడయ్యాక అంతా ఆయనే చూసుకుంటున్నారు. టీడీపీని వదిలపెట్టడం లేదు. పోలవరం విషయంలోనూ చంద్రబాబు చేసిన తప్పులను సోమువీర్రాజు ఎత్తి చూపుతూ వస్తున్నారు. పార్టీని దశాబ్దకాలాల నుంచి రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేసిన చంద్రబాబును సోము వీర్రాజు వదలిపెట్టడం లేదు. దీంతో జీవీఎల్ నరసింహారావు ఇక తనకు పని లేదని ఆయన మౌనంగా ఉన్నారని కూడా చెబుతున్నారు. మొత్తం మీద జీవీఎల్ నరసింహారావు మెత్తబడటానికి టీడీపీ సోషల్ మీడియానే కారణమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News