అబ్బయ్య దెబ్బకు చింత‌మ‌నేనికి జ్ఞానోద‌యం

అవును..! జుట్టు ఊడిపోయిన త‌ర్వాత దొరికే దువ్వెన మాదిరిగా ఉంద‌ట‌.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ చింత‌మ‌నేని [more]

;

Update: 2020-09-18 08:00 GMT

అవును..! జుట్టు ఊడిపోయిన త‌ర్వాత దొరికే దువ్వెన మాదిరిగా ఉంద‌ట‌.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ప‌రిస్థితి. ప్రస్తుతం ఆయ‌న ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. ఉద‌యం లేచింది మొద‌లు గ‌తంలో నాయ‌కుల‌ను వెంటేసుకుని హ‌ల్‌చ‌ల్ చేసేవారు. త‌న‌, మ‌న లేకుండా అందరితోనూ రెచ్చిపోయేవారు. కులాల వారీగా పేర్లు పెట్టి మరీ ప్రజ‌ల‌ను వేరు చేసేవారు. ఇక‌, దాడులు, ఘ‌ర్షణ‌లు, వివాదాల‌కు ఆయ‌న ఎప్పుడూ కేంద్రంగానే ఉన్నారు. అయితే, అలాంటి నాయ‌కుడు ఇప్పుడు ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు పేప‌ర్ చ‌దువుతున్నార‌ట‌. టీవీలో వార్తలు చూస్తున్నార‌ట‌.

మార్నింగ్ వాక్ తో….

ఇంత‌కీ ఆయ‌న తెలుసుకున్న జ్ఞానం ఏంటంటే.. అర‌రే.. నేను కూడా ఇలా చేసుంటే.. ఇన్ని వివాదాలు వ‌చ్చేవా ? కోర్టుల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చేదా ? అనే.ట‌. విష‌యం ఏంటంటే.. ఇక్కడ నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన యువ నాయ‌కుడు, వైసీపీ నేత‌.. అబ్బయ్య చౌద‌రి దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. మార్నింగ్ వాక్ నుంచి నైట్ స్లీప్ వ‌ర‌కు కూడా ఆయ‌న ప్రజా మంత్రం.. అభివృద్ధి తంత్రాన్నే ప‌ఠిస్తున్నారు. మార్నింగ్ వాక్ పేరుతో ప్రజలని కలుస్తూ, వారి సమస్యలని పరిష్కరిస్తున్నారు. పథకాల అమలులో ముందున్నారు. పేద‌ల కోసం ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను పార్టీల‌కు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందేలా చేస్తున్నారు.

ఏడాదిలోనే సీన్ రివర్స్…..

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో యువ నేత‌గా బలమైన టీడీపీ కేడర్‌ని తనవైపు తిప్పుకుంటున్నారు. టీడీపీ కంచుకోట‌లు లాంటి ప‌లు గ్రామాలను టార్గెట్‌గా చేసుకుని అక్కడ కీల‌క నేత‌ల‌కు వైసీపీ కండువాలు క‌ప్పేస్తున్నారు. టీడీపీకి కంచుకోట‌గా ఉండే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో… అందులోనూ ప్రభాక‌ర్ లాంటి బ‌ల‌మైన లీడ‌ర్ ఉండి కూడా ఓ జ‌డ్పీటీసీ, కొన్ని ఎంపీటీసీలు వైసీపీకి ఏక‌గ్రీవం అయ్యిందంటే ఇక్కడ సీన్ యేడాదిలో ఎంత రివ‌ర్స్ అయ్యిందో తెలుస్తోంది. ఇక అబ్బ‌య్య చౌద‌రి వివాదాల‌కు దూరంగా, గ‌తంలోలా క‌క్షపూరిత రాజ‌కీయాలు లేకుండా రాజ‌కీయం చేస్తున్నారు.

సమస్యలను పరిష్కరిస్తూ…..

ప్రపంచ ప‌ర్యాట‌క కేంద్రమైన కొల్లేరు స‌ర‌స్సులో రు. 300 కోట్లతో కొల్లేరులో రెగ్యులేటర్ ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న పామాయిల్ రైతులకు అండగా ఉంటూ, వారికి గిట్టుబాటు ధర దక్కేలా కృషి చేస్తున్నారు. ప‌దిహేనేళ్ల పాటు పాటు త‌న‌కు కంచుకోట‌గా ఉన్న దెందులూరులో ఇప్పుడు చింతమనేని ప్రభాక‌ర్ పేరు చెపితే మౌన‌మే స‌మాధానం అవుతోంది. ఇక త‌న కేడ‌ర్‌ను కూడా కాపాడుకోలేని ప‌రిస్థితి. గ‌ట్టిగా ప్రతిప‌క్షాన్ని నిల‌దీద్దామంటే మ‌ళ్లీ ఏ కొత్త కేసు న‌మోదు అవుతుందోన‌న్న ఆందోళ‌న ప్రభాక‌ర్‌ను వెంటాడుతోంది. దీంతో ప్రభాక‌ర్ తాను అధికారంలో ఉన్నప్పుడు ఇంత దూకుడుగా వెళ్లి ఉండ‌క‌పోతే ‌బాగుండేది క‌దా..! అని బాధ‌ప‌డుతున్నార‌ట‌. కానీ, ఏం చేస్తాం.. చేతులు కాలిపోయాయి క‌దా!! అంటున్నారు ఉన్న కొద్దిపాటి అనుచ‌రులు. ఇదీ సంగ‌తి

Tags:    

Similar News