ఐఏఎస్ శ్రీల‌క్ష్మికి మళ్లీ కష్టాలు తప్పవా?

అత్యంత పిన్న వ‌య‌సులోనే ఐఏఎస్ అయిన‌ శ్రీల‌క్ష్మి కొన్నాళ్లపాటు వార్తల్లో ఉన్న విష‌యం తెలిసిందే. ప్రస్తుత సీఎం జ‌గ‌న్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆమె కూడా [more]

;

Update: 2021-06-26 11:00 GMT

అత్యంత పిన్న వ‌య‌సులోనే ఐఏఎస్ అయిన‌ శ్రీల‌క్ష్మి కొన్నాళ్లపాటు వార్తల్లో ఉన్న విష‌యం తెలిసిందే. ప్రస్తుత సీఎం జ‌గ‌న్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆమె కూడా నిందితురాలుగా ఉన్నారు. దీంతో కొన్నాళ్లు.. జైలుకు కూడా వెళ్లివ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా శ్రీల‌క్ష్మి పేరు మార్మోగింది. అనంత‌రం.. ఆమె మ‌ళ్లీ.. ఇప్పుడు తాజాగా వార్తల్లోకి ఎక్కారు. క‌ర్ణాట‌క‌కు చెందిన ఓబులాపురం గ‌నుల కేసులో.. ఇప్పుడు ఆమె వ్యవ‌హారం మ‌ళ్లీ చ‌ర్చకు వ‌చ్చింది. ఓబులాపురం గ‌నుల వ్యవ‌హారానికి సంబంధించి గాలి జ‌నార్ధన్‌రెడ్డి కొన్నాళ్లు జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే.

గనుల కేసులో…

నిబంధ‌న‌ల మేర‌కు.. ఓబులాపురం గ‌నుల‌ను త‌వ్వుకోవాల్సిన లీజుదారులు ప‌రిధులు దాటి త‌వ్వకాలు జ‌రిపార‌ని. దీని వెనుక కీల‌క అధికారుల హ‌స్తం ఉంద‌ని.. పైస్థాయిలో ఈ విష‌యంలో జోక్యం ఉంద‌ని.. వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో శ్రీల‌క్ష్మిని అరెస్టు చేసి.. జైలుకు త‌ర‌లించారు. ఈ కేసులో.. మైనింగ్ లీజుదారుడు గాలి జ‌నార్దన్‌రెడ్డి కూడా ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. అయితే.. ఈ కేసును విచారించిన సీబీఐ.. శ్రీల‌క్ష్మిపైనా చార్జిషీట్లు న‌మోదు చేసింది. ఈ క్రమంలో సీబీఐ కోర్టు ఆరో నిందితురాలిగా ఉన్న శ్రీల‌క్ష్మికి సంబంధించిన పాత్రపై తుది తీర్పు ఇచ్చేందుకు రెడీ అయింది.

తనకు సంబంధం లేదని….

దీంతో శ్రీల‌క్ష్మి త‌ర‌ఫున వాద‌న‌లు వినాల‌ని నిర్ణయించుకుంది. కానీ, ఈలోగా ఆమె అస‌లు త‌న‌కు ఈ కేసుతో సంబంధం లేద‌ని.. త‌న పేరును తొల‌గించాల‌ని అభ్యర్థిస్తూ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచార‌ణ ఇంకా కొలిక్కిరాలేదు. అయితే.. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు సీబీఐకి కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించ‌డం.. సీబీఐ కూడా కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డం తెలిసిందే. ఈలోగా రెండు సార్లు దీనిపై సీబీఐ కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ రెండు సార్లు కూడా శ్రీల‌క్ష్మి త‌ర‌ఫున ఎలాంటి వాద‌న‌లు వినిపించ లేదు. దీంతో సీబీఐ కోర్టు న్యాయ మూర్తి.. హైకోర్టులో ఈ కేసు విచార‌ణ‌పై ఎలాంటి స్టే ఇవ్వలేదు క‌నుక‌.. కొన‌సాగిస్తున్నట్టు తెలిపారు.

తుది తీర్పు అంటూ….

అదే స‌మ‌యంలో ఈ నెల 29న వాద‌న‌లు వినిపించ‌క‌పోతే.. తుది తీర్పు వెలువ‌రుస్తున్నామ‌ని కూడా హెచ్చరించ‌డం గ‌మ‌నార్హం. సో.. మొత్తంగా చూస్తే.. శ్రీల‌క్ష్మి విష‌యం.. మ‌రోసారి ఆస‌క్తిగా మారింది. హైకోర్టు క‌నుక ఈ కేసులో స్టే ఇవ్వక‌పోతే.. సీబీఐ ఎలాంటి ఉత్త‌ర్వులు జారీ చేస్తుంద‌నేది ఉత్కంఠ‌కు దారితీసింది. ఇదిలావుంటే.. జ‌గ‌న్ప్ర‌భుత్వం ఇటీవ‌లే.. శ్రీల‌క్ష్మిని గ్రేడ్ మారుస్తూ.. ఇంట‌ర్నల్ ప్రమోష‌న్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News