Janasena : ఇద్దరినీ కలిపేందుకు ఆయన రెడీ
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు దాదాపుగా ఖరారయినట్లే. ఇప్పటికే మానసికంగా రెండు పార్టీల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమయ్యారు. ఇక అగ్రనేతలు ఇరువురూ కూర్చుని [more]
;
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు దాదాపుగా ఖరారయినట్లే. ఇప్పటికే మానసికంగా రెండు పార్టీల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమయ్యారు. ఇక అగ్రనేతలు ఇరువురూ కూర్చుని [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు దాదాపుగా ఖరారయినట్లే. ఇప్పటికే మానసికంగా రెండు పార్టీల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమయ్యారు. ఇక అగ్రనేతలు ఇరువురూ కూర్చుని మాట్లాడుకోవడమే. అయితే దీనికి ముందుగా జనసేనను బీజేపీ నుంచి బయటకు రప్పించాలి. ఆ తర్వాతనే పొత్తుకు మార్గం సులువు అవుతుంది. అయితే ఈ ఆపరేషన్ ను కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు చంద్రబాబు అప్పగించినట్లు సమాచారం.
టీడీపీ ఎమ్మెల్యే ఒకరు….
పవన్ కల్యాణ్ సామాజికవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే ఇదే పనిలో ఉన్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఢీకొట్టాలంటే ఖచ్చితంగా జనసేన, బీజేపీ కలసి ప్రయాణం చేయాలి. ఇది పార్టీ అగ్రనేతల నుంచి కిందిస్థాయి క్యాడర్ వరకూ అంగీకరిస్తున్న నిజం. అయితే జనసేన బీజేపీతో కలసి ఉన్నంత వరకూ అది సాధ్యం కాకపోవచ్చు. బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా లేదు.
బీజేపీ నుంచి….
దీంతో బీజేపి నుంచి జనసేనను తప్పించాలి. అయితే పవన్ కల్యాణ్ ఇప్పటికే అనేకమార్లు పార్టీల పొత్తులు మార్చడంతో మరోసారి బీజేపీని దూరం చేసుకోవడం ఆయనకు ఇబ్బందే. ఇదే విమర్శను ఆయన గతంలోనూ ఎదుర్కొన్నారు. అందుకే సరైన కారణం చూపి తప్పించి బీజేపీని దూరం చేసుకోలేరు. ఆ కారణం కోసం, సరైన సమయం కోసం పవన్ కల్యాణ్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ పట్ల పవన్ కల్యాణ్ కు ప్రత్యేకమైన అభిమానం అంటూ ఏమీ లేదు.
సరైన కారణం కోసం…
పార్టీ నేతలను, క్యాడర్ ను అధికార పార్టీ నుంచి రక్షించుకోవడం కోసమే బీజేపీతో ఎన్నికలు అయిపోగానే జట్టుకట్టారు. ఇప్పుడు బీజేపీని వదిలపెట్టడానికి పవన్ కల్యాణ్ కు అనేక కారణాలున్నాయి. ప్రత్యేకహోదా ఇవ్వలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తున్నారని, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని ఇలా అనేక కారణాలున్నాయి. కానీ మరింత బలమైన కారణం కోసం పవన్ వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ పొత్తు నుంచి బయటకు వస్తే రెండు పార్టీలు కలసి దున్నేయవచ్చన్న ప్లాన్ లో ఉంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే జనసేన అధినేతతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు.