స్పీడ్ గన్ కోసం కాంగ్రెస్ వేట …?
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయింది. ఇది అంటున్నది ఆ పార్టీ నాయకులే కావడం గమనార్హం. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఏపీ ని త్యాగం చేసింది [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయింది. ఇది అంటున్నది ఆ పార్టీ నాయకులే కావడం గమనార్హం. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఏపీ ని త్యాగం చేసింది [more]
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయింది. ఇది అంటున్నది ఆ పార్టీ నాయకులే కావడం గమనార్హం. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఏపీ ని త్యాగం చేసింది హస్తం పార్టీ. అయితే రాజకీయాలు ఎల్లకాలం ఒకేలా ఉండవు. నిన్న ఛీ కొట్టినవారే రాజకీయాల్లో తిరిగి కౌగిలించుకుంటారు. అలాగే కాంగ్రెస్ చేసిన అశాస్త్రీయ విభజనతో ఆ పార్టీ పై ద్వేషాన్ని పెంచుకున్న ఆంధ్ర ప్రజల్లో ఎప్పటికైనా మార్పు వచ్చి తమవైపు చూడకపోతారా ? అలా జనంలో మార్పు తెచ్చే దమ్మున్న నేత కోసం ప్రస్తుతం ఆ పార్టీ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది.
జగన్ సర్కార్ ఉన్నంతకాలం …?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ వెర్సెస్ టీడీపీ గానే ఉంది. అదీ కూడా అఖండ ప్రజాదరణతో జగన్ ను ఢీ కొని ముందుకు సాగడంలో తెలుగుదేశం పార్టీ కిందా మీదా పడుతుంది. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం తన పార్టీ ఖాతాలో జమచేసుకున్న వైసీపీ ని కనుచూపు మేరలో కదిలించలేమన్నది కాంగ్రెస్ కి క్లారిటీ ఉంది. అయితే ఆ పార్టీ లో దశాబ్దాల పాటు పదవులు అనుభవించి కష్టకాలంలో కాడి వదిలి దూరం అయ్యారు సీనియర్లు. చాలామంది వైసీపీ, టీడీపీ, బీజేపీ లలో సర్దుకుపోయారు. ఉన్న నేతలు యాక్టివ్ గా లేనేలేరు. దాంతో ఇప్పుడు తెలంగాణ లో రేవంత్ రెడ్డి తరహా దూకుడు గా దూసుకువెళ్ళే నేత కోసం అధిష్టానం చాలాకాలంగా గాలిస్తుంది.
రఘువీరా తరువాత …
ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరా రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలు అయితే చేశారు. పార్టీ ఏపీకి అన్యాయం చేయలేదంటూ ప్రజలకు చెబుతూనే వచ్చారు. అయితే ఆయన తరువాత శైలజానాధ్ ను అధ్యక్షుడిగా నియమించినా పార్టీలో ఏమాత్రం మార్పు లేదు సరికదా మరింతగా గ్రాఫ్ కిందకు పోతుంది. ప్రస్తుతం ఎపి పాలిటిక్స్ లో వైసీపీ, టీడీపీ తరువాత జనసేన – బిజెపి లు మూడోస్థానం లో ఉన్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు ఈ రేసు లో చివరి వరుసలోనే కొనసాగుతున్నారు. దాంతో చిట్టచివర ఉన్న కాంగ్రెస్ తక్షణం మూడో స్థానంలోకి వచ్చిన తరువాతే రెండో స్థానం కోసం పోరాడాలిసిఉంది. ఈ నేపథ్యంలో 2024 కాదు మరో పదేళ్ళపాటు కాంగ్రెస్ పరిస్థితి ఏపీ లో దయనీయంగానే ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. అయితే రధసారధిని మార్చి ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందో అని అధిష్టానం చేస్తున్న ఆలోచన ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.